వాట్సాప్ గ్రూపుల నుంచి బయటపడాలనుకుంటున్నారా..అయితే అందులో ఉన్న మీ స్నేహితులు ఫీల్ అవుతారనే భయం ుంటుంది. అయితే ఇప్పుడు వాట్సప్ (Whatsapp) కొత్త ఫీచర్ తీసుకువస్తోంది. అన్‌వాంటెడ్ గ్రూప్స్ నుంచి యూజర్లు సభ్యులకు తెలియకుండా బయటపడే (leave groups silently) సరికొత్త ఫీచర్‌పై వాట్సాప్ కసరత్తు సాగిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉందని, త్వరలోనే ఫ్యూచర్ అప్‌డేట్‌గా రానుందని వాబీటాఇన్ఫో వెల్లడించింది. తాజా ఫీచర్‌తో యూజర్లు గ్రూపు నుంచి నిష్క్రమిస్తే కేవలం గ్రూపు అడ్మిన్లకే ఆ విషయం తెలుస్తుంది. ఇతర యూజర్లకు సమాచారం ఉండదు.
వాట్సాప్ డెస్క్‌టాప్ బీటాలో ప్రస్తుతం ఈ ఫీచర్ కనిపిస్తుండగా త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ వాట్సాప్ బీటా వెర్షన్‌లో అందుబాటులోకి రానుంది. మరికొద్ది నెలల్లోనే తాజా ఫీచర్ వాట్సాప్ కలిగిన అన్ని డివైజ్‌ల్లోనూ అప్‌డేట్ కానుంది. మరోవైపు స్టేటస్ అప్‌డేట్స్‌లో రిచ్ లింక్ ప్రివ్యూస్‌ను వాట్సాప్ జోడిస్తోంది. లేటెస్ట్ బీటా వెర్షన్స్‌లో ఈ అప్‌డేట్ కనిపిస్తోందని వాబీటాఇన్ఫో తెలిపింది. ప్రస్తుత సెమీ ప్రివ్యూస్‌తో పోలిస్తే న్యూ లింక్ ప్రివ్యూస్ మరింత సమగ్రంగా ఉంటాయి.