Apple Stores Closed: కరోనా విశ్వరూపం, ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ స్టోర్లు మూసివేత, మార్చి 27 వరకు అన్ని బంద్ చేస్తున్నామని ప్రకటించిన ఆపిల్ సీఈఓ టిమ్ కుక్
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా స్కూల్స్, కాలేజీలు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ మూసేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆపిల్ (Apple) యాజమాన్యం కూడా చర్యలు చేపట్టింది. చైనా మినహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ స్టోర్స్‌ను మార్చి 27 వరకు మూసివేస్తున్నట్టు ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ (Apple CEO Tim Cook) ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
New Delhi, Mar 16: కోవిడ్-19(coronavirus) ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా స్కూల్స్, కాలేజీలు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ మూసేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆపిల్ (Apple) యాజమాన్యం కూడా చర్యలు చేపట్టింది. చైనా మినహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ స్టోర్స్‌ను మార్చి 27 వరకు మూసివేస్తున్నట్టు ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ (Apple CEO Tim Cook) ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
ఇండియాలో 107కి చేరిన కరోనా కేసులు
అంతేగాక కరోనా వైరస్ నిరోధానికి 15 మిలియన్ డాలర్లు విరాళమిస్తున్నట్టు తెలిపారు. చైనాలో కరోనా వైరస్ (coronavirus Outbreak) ప్రభావం తగ్గుముఖం పడుతోందని.. అక్కడున్న ఆపిల్ స్టోర్స్ పునఃప్రారంభం అవుతాయన్నారు. చైనాలోని గడ్డు పరిస్థితులను ఎదుర్కొని అంకితభావంతో పని చేస్తున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
అయితేఆపిల్ అధికారిక వెబ్‌సైట్ (www.apple.com) యాప్ స్టోర్ ద్వారా ఆన్‌లైన్‌లో వినియోగదారులకు అందుబాటులోవుంది. ఏవైనా సందేహాలుంటే వినియోగదారులు ఆన్‌లైన్ ఆపిల్ కస్టమర్ కేర్‌ను సందర్శించవచ్చు. అంతేకాదు కోవిడ్-19కు సంబంధించిన తాజా సమాచారాన్ని అందించేందుకు ఒకవిభాగాన్ని కూడా ప్రారంభించింది.
Here's Apple CEO Tweet
కరోనావైరస్ మహమ్మారి కారణంగా, ఆపిల్ తన డెవలపర్ కాన్ఫరెన్స్ కు సంబంధించి ఆన్‌లైన్ ఫార్మాట్‌ను ఆశ్రయిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్-2020 ఆన్‌లైన్ కీనోట్, సెషన్‌లు ఆన్‌లైన్‌లోనే వుంటాయని గ్లోబల్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఫిల్ షిల్లర్ తెలిపారు. రానున్న వారాల్లో మరింత సమాచారాన్ని అందిస్తామని తెలిపారు.
కాగా ప్రస్తుతానికి, కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 1,45,000 మందికి పైగా సోకింది. 5400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారత దేశంలో ఈ కోరన్ కోరలకు చిక్కిన వారి సంఖ్య శనివారం నాటికి 107కు చేరింది. జాతీయ విపత్తుగా భారత ప్రభుత్వం ప్రకటించగా, దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు అన్ని విద్యాలయాలు, సినిమా థియేటర్లను, షాపింగ్‌మాల్స్‌ను మూసివేస్తున్నట్టు ప్రకటిచాయి.