ChatGPT Fails JEE: ఆ పరీక్షలో ఫెయిలయిన చాట్‌జీపీటీ!జేఈఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో కేవలం 11 ప్రశ్నలకే సమాధానమిచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్
AI-ఆధారిత ChatGPT జేఈఈ ఎగ్జామ్ క్రాక్ చేయడంలో ఫెయిల్ అయింది. JEE ఎగ్జామ్ అనేది చాలా కష్టతరమైనది.
New Delhi, April 13: చాట్‌జీపీటీ (ChatGPT).. ప్రస్తుతం ఈ పేరు వింటేనే చాలు ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. ఎందుకంటే.. చాట్‌జీపీటీ చేయలేనిది ఏమీ లేదు.. ఎలాంటి స్క్రిప్ట్‌లైనా రాయగలదు. కష్టతరమైన ప్రశ్నపత్రాలను సైతం క్షణాల్లో పరిష్కరించగలదు. అందుకే (OpenAI) చాట్‌బాట్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ప్రతిదీ (ChatGPT)కు కేక్‌వాక్ కాదని తేలిపోయింది. అందులోనూ భారత ప్రతిష్టాత్మకమైన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్‌ను క్లియర్ చేయడం అంత ఈజీ కాదని నిరూపితమైంది. AI-ఆధారిత ChatGPT జేఈఈ ఎగ్జామ్ క్రాక్ చేయడంలో ఫెయిల్ అయింది. JEE ఎగ్జామ్ అనేది చాలా కష్టతరమైనది. భారత్‌లో అగ్రశ్రేణి ఇంజినీరింగ్ సంస్థలలో అడ్మిషన్ పొందాలనే ఆశించే వేలాది మంది విద్యార్థులకు జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పెద్ద టాస్క్.. అలాంటి JEE పరీక్షలో ChatGPT పర్ఫార్మెన్స్ నిరాశపరిచింది. ఎందుకంటే.. కేవలం రెండు పేపర్‌లలో మొత్తం ప్రశ్నలలో 11 ప్రశ్నలను మాత్రమే పరిష్కరించింది.
IIT ఢిల్లీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రామ్ గోపాల్ రావు (Ram Gopal Rao) ప్రకారం.. JEE అనేది సంక్లిష్టమైన కాంప్లెక్స్ డయాగ్రామ్స్, ఫిగర్స్ కలిగి ఉంటుంది. క్రాక్ చేయడంలో అత్యంత కఠినమైన పరీక్ష కూడా. అలాంటి JEE పరీక్షను క్రాక్ చేయడం అనేది ChatGPTకి అతిపెద్ద సవాలుగా మారింది. భారత్‌లో అగ్రశ్రేణి ఇంజినీరింగ్ సంస్థలలో అడ్మిషన్ పొందాలనే ఆశించే వేలాది మంది విద్యార్థులకు జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పెద్ద టాస్క్.. అలాంటి JEE పరీక్షలో ChatGPT పర్ఫార్మెన్స్ నిరాశపరిచింది. ఎందుకంటే.. కేవలం రెండు పేపర్‌లలో మొత్తం ప్రశ్నలలో 11 ప్రశ్నలను మాత్రమే పరిష్కరించింది. IIT ఢిల్లీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రామ్ గోపాల్ రావు (Ram Gopal Rao) ప్రకారం.. JEE అనేది సంక్లిష్టమైన కాంప్లెక్స్ డయాగ్రామ్స్, ఫిగర్స్ కలిగి ఉంటుంది. క్రాక్ చేయడంలో అత్యంత కఠినమైన పరీక్ష కూడా. అలాంటి JEE పరీక్షను క్రాక్ చేయడం అనేది ChatGPTకి అతిపెద్ద సవాలుగా మారింది.
ముఖ్యంగా, NEET పరీక్షలోని జీవశాస్త్ర విభాగంలో మాత్రమే ChatGPT అద్భుతంగా ప్రశ్నలకు సమాధానమిచ్చింది. EE అడ్వాన్స్‌డ్ పరీక్షలో విఫలమైనప్పటికీ.. NEET పరీక్షలో ChatGPT పర్ఫార్మెన్స్ ఇతర రంగాలలో రాణించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని సూచిస్తుంది. ChatGPT అనేది AI- పవర్డ్ లాంగ్వేజ్ మోడల్ అనేది తెలిసిందే. అంటే.. ఇది ఒక లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ టూల్.. ఏదైనా సారాంశాన్ని అందించడంతో పాటు అనేక ప్రశ్నలకు సమాధానమివ్వడం వంటి అనేక రకాల పనులను క్షణాల వ్యవధిలో పూర్తి చేయడంలో ట్రైనింగ్ పొందింది. ఈ AI మోడల్ విశేషమైన సామర్థ్యాలతో తక్కువ వ్యవధిలోనే విస్తృతంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చాలా మంది ఉద్యోగాలపై అనిశ్చితిని కలిగేలా చేసింది. JEE అడ్వాన్స్‌డ్ పరీక్షలో చాట్‌జీపీటీకి ఎదురుదెబ్బ తగలడంతో అత్యంత అధునాతన AI మోడల్‌కు పరిమితులు ఉన్నాయనే విషయం అర్థమవుతోంది. AI అనేక రంగాలలో విప్లవాత్మక మార్పులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ, క్లిష్టమైన టాస్కులను పూర్తి చేయడంలో మానవ మేధస్సుతో సమానంగా లేదనే విషయాన్ని గమనించాలి.