JioPhone 5G: జియో నుంచి అత్యంత తక్కువ ధరకే 5జీ ఫోన్, లీకయిన జియోఫోన్‌ 5జీ స్పెసిఫికేషన్స్‌

కాగా ఇప్పుడు మరో సంచలనానికి రిలయన్స్‌ జియో తెర లేపింది. త్వరలోనే అత్యంత చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్‌ లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Reliance Jio (File Photo)

రిలయన్స్ జియో రాకతో భారత టెలికాం రంగంలో పెను విప్లవాలు చోటు చేసుకున్నాయి. భారత్‌లో డిజిటల్‌ సాధికారితను సాధించేందుకు గాను అత్యంత తక్కువ ధరకే జియోఫోన్‌ నెక్ట్స్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్‌ తీసుకొచ్చింది. జియో, గూగుల్‌ భాగస్వామ్యంతో జియోఫోన్‌ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు మరో సంచలనానికి రిలయన్స్‌ జియో తెర లేపింది. త్వరలోనే అత్యంత చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్‌ లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

భారత్‌లో 5G విప్లవం ఈ ఏడాది నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 5జీ విస్తరణలో రిలయన్స్ జియో ముందంజలో నిలుస్తోంది. అందుకు తగ్గట్టుగా 5జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసే పనిలో రిలయన్స్‌ నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్‌ జియో లాంచ్‌ చేసే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో అత్యంత చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచే​ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 5జీ స్మార్ట్‌ఫోన్స్‌లో అధిపత్యాన్ని చెలాయిస్తోన్న రియల్‌మీ, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్స్‌కు పోటీగా రిలయన్స్‌ జియో 5జీ స్మార్ట్‌ఫోన్‌ తీసుకురానుంది.

పోర్న్ వీడియోలు చూసేవారు ఈ మెసేజ్ వస్తే ఓపెన్ చేయకండి, ఓపెన్ చేస్తే డబ్బులు కట్టాలంటూ మెసేజ్ వస్తుందని తెలిపిన ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రజాహ్‌రియా

ప్రస్తుతం 5జీ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో రూ. 13 వేలకు అందుబాటులో ఉంది. దీని కంటే తక్కువ ధరకు 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్‌ జియో లాంచ్‌ చేసే అవకాశం ఉంది. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ దాదాపు రూ. 10 వేలకు లభించనుంది.

జియోఫోన్‌ 5జీ స్పెసిఫికేషన్స్‌ (అంచనా)

6.5-అంగుళాల హెచ్‌డీ LCD డిస్‌ప్లే

క్వాలకం స్నాప్‌డ్రాగన్‌ 480 ప్రాసెసర్‌

ప్రగతి ఓఎస్‌ బదులుగా ఆండ్రాయిడ్‌ ఓఎస్‌

4GB RAM+ 32GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌

13-ఎంపీ+2-ఎంపీ రియర్‌ కెమెరా

8-ఎంపీ సెల్ఫీ కెమెరా

మైక్రో SD కార్డ్ స్లాట్‌

N3, N5, N28, N40, N78 బ్యాండ్‌ సపోర్ట్‌

18W ఫాస్ట్ ఛార్జింగ్‌

సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్

5000mAh బ్యాటరీ

USB-C సపోర్ట్