దేశంలో కొత్తగా పోర్న్ స్కామ్ కలకలం రేపుతోంది. ఈ స్కాంలో ఇరుక్కున్న వాళ్లు సైబర్ నేరగాళ్లు (Cyber Frauds) అడిగినంతా చెల్లించి సైలెంట్ అయిపోతున్నారు. పోర్న్ చూస్తుండగా సడెన్‌గా బ్రౌజర్ బ్లాక్ కావడం, డబ్బులు చెల్లించాలని అందులో మెసేజ్ ఉండటం, డబ్బులు చెల్లించిన తర్వాత బ్రౌజర్ అన్‌బ్లాక్ కావడం జరుగుతోంది. ఈ మోసాలపై సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ Rajshekhar Rajhariya అప్రమత్తం చేస్తున్నారు.

ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రజాహ్‌రియా  తెలిపిన వివరాల ప్రకారం యూజర్ కంప్యూటర్‌లో పోర్న్ చూస్తుండగా బ్రౌజర్ బ్లాక్ అవుతుంది. బ్రౌజర్‌ను అన్‌బ్లాక్ చేయాలంటే డబ్బులు చెల్లించాలని ఓ పాప్ అప్ మెసేజ్ కనిపిస్తుంది. ఆ తర్వాత నుంచి ఆ బ్రౌజర్ పనిచేయదు. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ నుంచి ఈ మెసేజ్ వచ్చినట్టు హ్యాకర్లు నమ్మిస్తారు. మీ కంప్యూటర్ లాక్ అయిందని, అన్‌లాక్ చేయాలంటే రూ.29,000 చెల్లించాలని అందులో ఉంటుంది. ఆరు గంటల్లో జరిమానా చెల్లించాలని, లేకపోతే కంప్యూటర్‌ను నేర విచారణ కోసం సంబంధిత మంత్రిత్వ శాఖకు ట్రాన్స్‌ఫర్ చేస్తామని మెసేజ్ ఉంటుంది. ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)