ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఎక్స్ (X) వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఎక్స్‌లో ‘నాట్ ఎ బాట్’ (Not A Bot) అనే కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ (Subscription Plane)ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ట్విట్టర్ కొత్త యూజర్లు పోస్ట్ చేయాలన్నా, వేరొకరి ట్వీట్‌ను రీ ట్వీట్ చేయాలన్నా, రిప్లే ఇవ్వాలన్నా, లైక్ కొట్టాలన్నా కొంత మేర డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ ఫీజు ఏడాదికి ఒక డాలర్‌గా సంస్థ వసూలు చేయనుంది.
ఈ కొత్త నిబంధనను మొదట న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో ప్రయోగాత్మకంగా టెస్ట్ చేస్తున్నారు. స్పామ్, ఆటోమేటెడ్ బాట్ అకౌంట్లను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు ట్విట్టర్ తెలిపింది. అయితే, సభ్యత్వం పొందకూడదనుకునే కొత్త వినియోగదారులు పోస్ట్‌లను చదవడం, వీడియోలను వీక్షించడం, ఖాతాలను అనుసరించే వెసులుబాటు ఉంటుంది.
Here's News
Elon Musk’s X/Twitter to Charge $1 per Year for basic features like tweeting and retweeting#BreakingNews #Twitter #ElonMusk https://t.co/6cxEtCXeH1
— India.com (@indiacom) October 18, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)