RBI's New Auto-Debit Rules: ఆటో డెబిట్ ఆప్షన్ ఉపయోగిస్తున్నారా..నేటి నుంచి ఆర్‌బిఐ కొత్త రూల్స్ వచ్చాయి, ఇకపై రూ. 5 వేలకు మించితే ఓటీపీ ఉండాల్సిందే, ఆర్‌బీఐ రూల్స్ ఓ సారి తెలుసుకోండి
డెబిట్, క్రెడిట్ కార్డు వాడే యూజర్లు ఆటోమేటిక్ చెల్లింపులకు ( RBI's New Auto-Debit Rules:) సంబంధించి సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్త రూల్ ప్రకారం.. చెల్లింపుదారుడి ధృవీకరణ లేకుండా ఇకపై రూ. 5 వేలకు మించి ఆటోమేటిక్ చెల్లింపులు (Auto Payment to Fail from Oct 1 ) జరగవు.
New Delhi, Oct 1: నేటి నుంచి పేమెంట్ దారులకు ఆర్‌బీఐ కొత్త రూల్స్ జారీ చేసింది. డెబిట్, క్రెడిట్ కార్డు వాడే యూజర్లు ఆటోమేటిక్ చెల్లింపులకు ( RBI's New Auto-Debit Rules:) సంబంధించి సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్త రూల్ ప్రకారం.. చెల్లింపుదారుడి ధృవీకరణ లేకుండా ఇకపై రూ. 5 వేలకు మించి ఆటోమేటిక్ చెల్లింపులు (Auto Payment to Fail from Oct 1 ) జరగవు. కచ్చితంగా ఓటీపీ కన్ఫర్మేషన్ జరగాల్సిందే. ఈ విషయాన్ని గుర్తించాలని చెల్లింపుదారులను ఆర్బీఐ అప్రమత్తం చేస్తోంది.
అక్టోబర్ 1, 2021 నుంచి ఐదు వేలకు మించిన ఆటోమేటిక్ డెబిట్ చెల్లింపులు.. అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (AFA) ఉంటేనే ఆ ట్రాన్‌జాక్షన్ సక్రమంగా జరుగుతాయి. అంటే ఆటోమేటిక్‌గా కట్ కాకుండా.. ఓటీపీ కన్ఫర్మేషన్ ద్వారానే ఆ చెల్లింపు జరుగుతుంది. వ్యక్తిగత చెల్లింపుల భద్రత కోసం ఈ నిబంధన తీసుకొచ్చినట్లు ఆర్బీఐ చెబుతోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్ స్క్రిప్షన్ ప్యాక్‌లు, ఫోన్ రీఛార్జీలు, బిల్ పేమెంట్స్, ఇన్సురెన్స్ ప్రీమియమ్, యుటిలిటీ బిల్స్(ఐదు వేలకు మించినవి) ఈ పరిధిలోకి వస్తాయి.
ఐదు వేల లోపు ఆటోమేటిక్ కార్డు చెల్లింపులు, అలాగే ‘వన్స్ ఓన్లీ’ పేమెంట్స్‌కు మాత్రం కొత్త నిబంధనలు వర్తించవు. ఇక హోం లోన్స్ ఈఎంఐగానీ, ఇతరత్ర ఈఎంఐపేమెంట్స్‌గానీ ఐదువేల రూపాయలకు మించి ఆటోడెబిటింగ్ ఫెసిలిటీ ఉండేది ఇన్నాళ్లూ. అయితే ఇకపై ఇలా కుదరదు. మ్యానువల్‌గా అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ తరహా పేమెంట్స్‌కు యూజర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. అలాంటిదేం లేదని స్పష్టం చేసింది ఆర్బీఐ. కాకపోతే తాముపేర్కొన్న విధంగా నిబంధనలు పాటించని బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకొనున్నట్లు మొదటి నుంచి చెబుతూ వస్తోంది ఆర్బీఐ. ఈ తరుణంలో ఇప్పటికే చాలా బ్యాంకులు కస్టమర్లకు అలర్ట్ మెసేజ్‌లను, మెయిల్స్‌ను పెట్టేశాయి.
అన్ని రకాల క్రెడిట్, డెబిట్ కార్డులకు (Debit Card, Credit Card) దేశీయ అంతర్జాతీయ లావాదేవీలకు నిబంధనలు వర్తిస్తాయి. అయితే మ్యూచువల్ పండ్స్ ఇతరత్రా సంబంధిత పేమెంట్లపై ఈ ప్రభావం ఉండదు. పేమెంట్ కు 24 గంటల ముందు ఖాతాదారులు,యూజర్లను బ్యాంకులు అప్రమత్తం చేయాలి.