Gmail (Photo Credits: Gmail)

ప్ర‌స్తుతం టెక్నాలజీ అమిత వేగంతో దూసుకుపోతోంది. హ్యకర్లు కూడా అదే స్థాయిలో చెలరేగిపోతున్నారు. చాలామంది జీమెయిల్‌, ఔట్‌లుక్‌, యాపిల్ మెయిల్ తమ రోజు వారీ పనుల కోసం ఉప‌యోగిస్తుంటారు. ఇదివ‌ర‌కు అయితే యాహూ, రెడిఫ్ ఉప‌యోగించేవారు అవి తెర వెనక్కి వెళ్లడంతో అందరూ ఎక్కువ‌గా జీమెయిల్ వాడుతున్నారు.

అయితే.. కొన్నిసార్లు మెయిల్‌కు ప్ర‌మోష‌న‌ల్ మెయిల్స్ వ‌స్తుంటాయి. వాటిని ఎవ‌రు పంపిస్తారో తెలియ‌దు. ఆ మెయిల్స్ ఓపెన్ చేస్తే అందులో కొన్ని లింక్స్ ఉంటాయి. ఇంకొన్ని అట్రాక్టివ్ ఆఫ‌ర్స్ ఉంటాయి. ఆ మెయిల్స్‌ను క‌స్ట‌మ‌ర్లు ఓపెన్ చేశారా లేదా.. లింక్ క్లిక్ చేశారా.. లేదా.. అనే విష‌యాల‌న్నింటినీ కొన్ని కంపెనీలు ట్రాక్ (Tracked on Gmail) చేస్తుంటాయి. క‌స్ట‌మ‌ర్ల‌కు ఆ విష‌యం తెలియ‌దు.

ఈమెయిల్ ట్రాకింగ్ సిస్ట‌మ్ ద్వారా అవి మెయిల్స్ ఓపెన్ రేట్‌ను ట్రాక్ చేస్తుంటాయి. దాని కోసం క‌స్ట‌మ‌ర్ల‌కు పంపించే ఈమెయిల్‌లోనే సింగిల్ ట్రాకింగ్ పిక్సెల్ కోడ్‌ను ఎంబెడ్ చేస్తారు. అదే.. కంపెనీ స‌ర్వ‌ర్‌కు.. ఓపెన్ రేట్‌ను పంపిస్తుంటుంది. అయితే.. ఈ ట్రాకింగ్ సిస్ట‌మ్ వ‌ల్ల‌.. క‌స్ట‌మ‌ర్‌ ఈమెయిల్ ప‌ర్స‌న‌ల్ డిటెయిల్స్‌, మెయిల్స్ లాంటి వాటిని కంపెనీ ట్రాక్ చేయ‌లేదు కానీ.. కేవ‌లం.. ఆ కంపెనీ పంపించిన మెయిల్ ఓపెన్ రేట్‌ను మాత్ర‌మే ట్రాక్ చేయ‌గ‌లుగుతుంది.

కరోనాలో పోర్న్ సైట్లు చూస్తున్నారా.. ఈ విషయాలు గుర్తు పెట్టుకోకుంటే మీరు ప్రమాదంలో పడినట్లే, మీ ఫోన్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లడం ఖాయం, సెక్స్ వీడియోలు చూసేవారు గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో ఓ సారి చూద్దాం

ఈ నేపథ్యంలో ప్ర‌మోష‌న‌ల్ మెయిల్స్ ఓపెన్ రేట్‌ను కూడా ట్రాక్ చేయ‌కుండా (How to Block Email Tracking) ఉండాలంటే మీరు సెక్యూరిటీని పెంచుకోవాలి. అయితే అది ఎలా పెంచుకోవాలో చాలామందికి తెలియదు. ఈ సింపుల్ ట్రిక్ ద్వారా మీరు దీని నుంచి ఈజీగా బయటపడవచ్చు.

జీమెయిల్‌లో ఎలా సెట్ చేసుకోవాలి?

మీరు జీమెయిల్ యూజ‌ర్లు అయితే.. డెస్క్‌టాప్‌లో జీమెయిల్ ఓపెన్ చేసి.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్క‌డ జ‌న‌ర‌ల్ ట్యాబ్‌లోకి వెళ్లండి. అక్క‌డ ఫైండ్ ఇమేజెస్ అనే ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేసుకోండి. అక్క‌డ Ask before displaying external images అనే ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేంజెస్ బ‌ట‌న్ మీద క్లిక్ చేయండి. దీని వ‌ల్ల‌.. ప్ర‌మోష‌న‌ల్ కోసం పంపించే మెయిల్స్‌లో ఉండే ఫోటోలు లోడ్ కావు.. డౌన్‌లోడ్ కావు. మొబైల్‌లో కూడా సేమ్ ఇదే ప్రొసీజ‌ర్ ఉప‌యోగించి.. ఇమేజ్‌లు లోడ్ కాకుండా బ్లాక్ చేయొచ్చు.

మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్‌లో ఎలా బ్లాక్ చేయాలి?

ఔట్‌లుక్ మెయిల్ వాడేవాళ్లు.. స‌ప‌రేట్ గా సెట్టింగ్స్ చేసుకోవాల్సిన ప‌నిలేదు. ప్ర‌మోష‌న‌ల్ ఫోటోల‌ను ఔట్‌లుక్ డీఫాల్ట్‌గా బ్లాక్ చేస్తుంది. అయితే.. ఒక్కోసారి కొన్ని ఫోటోలు లోడ్ అయితే మాత్రం ఫైల్‌లోకి వెళ్లి ఆప్ష‌న్స్‌, ట్ర‌స్ట్ సెంట‌ర్, ట్ర‌స్ట్ సెంట‌ర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్క‌డ ఆటోమెటిక్ డౌన్‌లోడ్ ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేసుకొని Don’t download pictures automatically in RSS items or standard HTML e-mail messages అనే ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇది విండోస్ ఓఎస్ వాళ్ల‌కు మాత్రమే. ఒక‌వేళ మాక్ ఓఎస్ వాడే యూజ‌ర్లు అయితే.. ఔట్‌లుక్‌లో ప్రిఫ‌రెన్సెస్, రీడింగ్, సెక్యూరిటీ మీద క్లిక్ చేసి.. ఇమేజెస్ డౌన్‌లోడ్ కాకుండా ఆఫ్ చేసుకోవ‌చ్చు.

యాపిల్ మెయిల్‌లో ఎలా బ్లాక్ చేయాలి?

మాక్‌లో యాపిల్ మెయిల్ యాప్ ఓపెన్ చేసి.. ఆటోమెటిక్ ఇమేజ్ లోడింగ్‌ను డిసేబుల్ చేసుకోవాలి. మెయిల్, ప్రిఫ‌రెన్సెస్‌, వ్యూయింగ్‌, లోడ్ రిమోట్ కంటెంట్ ఆనే ఆప్ష‌న్‌ను అన్‌చెక్ చేసుకోవాలి. ఐఫోన్ మొబైల్ యాప్‌లో అయితే.. సెట్టింగ్స్‌, మెయిల్ అండ్ టాగ్లింగ్ ఆఫ్ లోడ్ రిమోట్ ఇమేజెస్ అనే ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.