Jio UPI Payment Service: జియో డిజిటల్ పేమెంట్ యాప్ వచ్చేసింది, ఆప్సన్ ఎలా చెక్ చేసుకోవాలి ?, పేమెంట్ ఎలా చేయాలి అనే దానిపై గైడెన్స్ మీకోసం

గూగుల్, పేటీఎమ్, ఫోన్ పే వంటి డిజిటల్ పేమెంట్ యాప్స్‌కి ధీటుగా ఇండియాలో రిలయన్స్ జియో డిజిటల్ పేమెంట్స్‌ను (UPI Payments Service) తీసుకొస్తోంది. ప్రస్తుత My Jio Appలోనే సరికొత్త UPI పేమెంట్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా యూజర్లు ఈజీగా యూపీఐ ఆధారిత పేమెంట్స్ చేసుకోవచ్చు.

Reliance Jio Launches UPI Payments Service on My Jio App to Take on PhonePe Google Pay in India(Photo-PTI)

Mumbai, January 25: దేశీయ టెలికాం రంగంలో పెను విప్లవాలకు నాంది పలికిన రిలయన్స్ జియో (Reliance Jio) యుపిఐ పేమెంట్ రంగంలో కూడా తన ముద్రను వేసేందుకు రెడీ అయింది. గూగుల్, పేటీఎమ్, ఫోన్ పే వంటి డిజిటల్ పేమెంట్ యాప్స్‌కి ధీటుగా ఇండియాలో రిలయన్స్ జియో డిజిటల్ పేమెంట్స్‌ను (UPI Payments Service) తీసుకొస్తోంది. ప్రస్తుత My Jio Appలోనే సరికొత్త UPI పేమెంట్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా యూజర్లు ఈజీగా యూపీఐ ఆధారిత పేమెంట్స్ చేసుకోవచ్చు.

యూజర్లకు టెల్కోల షాక్

ఈ కొత్త ఆప్షన్.. JioMoney వ్యాలెట్ సహా వివిధ ఇతర జియో Apps లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. రానున్న రోజుల్లో JioSaavn, JioCinema యాప్స్ కూడా యాక్సస్ చేసుకునేలా UPI పేమెంట్స్ ఆప్షన్ ఎనేబుల్ చేయనుంది. అయితే ఈ UPI ఆప్షన్ కు టెలికం ఆపరేటర్ సపరేటు పేరు పెట్టే యోచనలో ఉంది. అయితే ఈ ఆప్షన్.. కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అందరికీ అందుబాటులోకి రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

టారిఫ్ ధరలను పెంచే యోచనలో కంపెనీలు

ఈ UPI పేమెంట్ ఆప్షన్ మీ ఫోన్లో ఎనేబుల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలంటే.. ముందుగా మీ ఫోన్ లోని My Jio Appలోకి వెళ్లి చూడండి.. UPI పేమెంట్ ఆప్షన్ కనిపించలేదంటే ఇంకా మీకు అందుబాటులోకి రాలేదని భావించాలి. లైవులోకి వచ్చిన తరువాత ఇతర డిజిటల్ పేమెంట్స్ యాప్స్ మాదిరిగానే యూజర్లందరూ దీని ద్వారా ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. మరోవైపు ఇన్ స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ కూడా UPI సర్వీసును త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది.

3 రోజుల్లో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ

Jio UPI పేమెంట్ ఎలా వాడాలంటే? :

వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPI)తో పాటు UPI హ్యాండిల్ @Jio అని ఉంటుంది.

వ్యాలీడ్ మొబైల్ నెంబర్, Bank అకౌంట్ వివరాలతో Sign Up అవ్వాల్సి ఉంటుంది.

ఇక్కడ మీరు UPI PIN సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.

మీరు Add చేసిన బ్యాంకు అకౌంట్లలోకి ఈజీగా Money పంపుకోవచ్చు.