Mobile Call Tariffs Hike Bharti Airtel, Vodafone Idea may hike tariffs by up to 30%( Photo-PTI)

Mumbai,November 30: డిసెంబర్ నుంచి మొబైల్ వినియోగదారులకు చుక్కలు కనపడనున్నాయి. మొబైల్‌ కాల్‌ చార్జీ ధరలు (Mobile Call Tariffs Hike) భారీగా పెరగనున్నాయి. పెరిగిన ధరలు డిసెంబర్ నెల నుంచి అమల్లోకి వస్తుండడంతో వినియోగదారుల (Users) జేబులు గుల్ల కానున్నాయి.

ట్రాయ్, టెలికాం విభాగాల (Trai And Telecom) మధ్య ఒక ఏకాభిప్రాయం కుదరకపోవడంతో టారిఫ్ పెంపు అనివార్యమని టెలికాం కంపెనీలు (Telcos) స్పష్టం చేశాయి. ఇందులో భాగంగా డిసెంబర్ నెల నుంచి టారిఫ్‌లు పెంచేందుకు ఎయిర్ టెల్, రిలయెన్స్, జియో, వొడాఫోన్, ఐడియా, బీఎస్ఎన్ఎల్‌లు రెడీ అయిపోయాయి.

ఇక టారిఫ్‌లపై ఇక ఎలాంటి చర్చలు ఉండవని, మున్ముందు కూడా ఛార్జీలు పెరుగుతాయని టెలికాం వర్గాలు(Bharti Airtel and Vodafone Idea) స్పష్టం చేశాయి. టెలికాం కంపెనీల టారిఫ్‌ల పెంపులో తాము జోక్యం చేసుకోమని పేరు చెప్పేందుకు ఇస్టపడని ఓ అధికారి తెలిపారు.

కాల్ ఛార్జీలు అమల్లోకి వచ్చాక..యూజర్ నుంచి వచ్చే రెస్పాండ్ ఎలా ఉంటుందో వేచి చూస్తామని, ఏఆర్‌పీయూలు తగిన స్ధాయిలో ఉంటే ఫ్లోర్‌ ప్రైసింగ్‌ అవసరం లేదని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(cellular operators association of india) డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మ్యాథ్యూస్‌(‎Rajan S. Mathews) చెప్పారు.

టారీఫ్‌ల పెంపునకు జియో ( Reliance jio) కూడా సంకేతాలు పంపినా ఇతర టెలికాం కంపెనీలు పెంచిన స్థాయిలో ఛార్జీల పెంపు ఉండదని భావిస్తున్నారు. టారిఫ్‌లు పెంచకుంటే..తాము పెద్ద సంఖ్యలో సబ్ స్రైబర్లను కోల్పోతామని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.