Birds Divorce Too: మనుషులే కాదు పక్షులూ విడాకులు తీసుకుంటాయట.. ఆస్ట్రేలియా పరిశోధకుల వెల్లడి.. మరి ఎందుకు విడాకులు తీసుకుంటాయంటే??

అయితే, అనేక పక్షులు సైతం చాలాకాలం ఒకే సహచరితో జీవించడమే కాదు కొన్ని సందర్భాల్లో మనుషుల్లానే విడిపోతాయని తెలుసా?

Birds (Credits: pixabay)

Newdelhi, Nov 26: భేదాభిప్రాయాలు, ఇగోల కారణంగా మనుషులు (Humans) విడాకులు (Divorce) తీసుకునే ఘటనలను చూస్తూనే ఉంటాం. అయితే, అనేక పక్షులు (Birds) సైతం చాలాకాలం ఒకే సహచరితో జీవించడమే కాదు కొన్ని సందర్భాల్లో మనుషుల్లానే విడిపోతాయని తెలుసా? వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది నిజమేనని అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు. మాక్వారీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సీషెల్స్‌ ద్వీపాల్లో కనిపించే సీషెల్స్‌ వార్‌ బ్లెర్‌ అనే పక్షులపై అధ్యయనం జరిపారు. సీషెల్స్‌ వార్‌ బ్లెర్‌ పక్షులు 15 ఏండ్ల పాటు సహచరితో కలిసి ఉంటాయని, యేటా 1 నుంచి 16 శాతం వరకు తమ బంధాన్ని తెంచుకుంటున్నాయని పరిశోధకులు గుర్తించారు.

హైదరాబాద్‌ లోని జీడిమెట్లలో రోడ్డు మీద ఏరులై పారిన ఎర్రటి ద్రవం.. రక్తమేమోనని స్థానికుల ఆందోళన.. చివరకు తేలింది ఏమంటే? (వీడియోతో)

కారణం ఏంటంటే?

ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ పక్షులు ఎక్కువగా విడిపోతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. సంతానోత్పత్తి సమయంలో వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పక్షులు ఎక్కువగా విడిపోతున్నట్టు గుర్తించామని వాళ్లు చెప్పారు.

మేడ్చల్ జిల్లా పోచారం ఐటి కారిడార్ సమీపంలోని ఎల్లమ్మ ఆలయంలో చోరీ.. గుడిలో అమ్మవారినీ ఎత్తుకెళ్ళిన దుండగులు (వీడియో)