Chandrayaan-3: చంద్ర‌యాన్-3 మిష‌న్‌ రెడీ, వ‌చ్చే ఏడాది ఆరంభంలో ప్రయోగం, చంద్ర‌యాన్-2కి భిన్నంగా చంద్ర‌యాన్‌-3, ఆర్బిట‌ర్ లేకుండానే చందమామ మీదకు, వెల్లడించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

చ‌ంద్రుడిపైకి చంద్ర‌యాన్-3 మిష‌న్‌ను వ‌చ్చే ఏడాది ఆరంభంలోనే ప్ర‌యోగించ‌నున్న‌ట్లు భార‌త అంత‌రిక్ష శాఖ‌కు చెందిన స‌హాయ‌మంత్రి జితేంద్ర సింగ్ (Union Minister Jitendra Singh) తెలిపారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌యాన్-2తో పోలిస్తే చంద్ర‌యాన్‌-3 భిన్నంగా ఉంటుంద‌న్నారు. చంద్ర‌యాన్‌-3లో ఆర్బిట‌ర్ (Will Not Have Orbiter) ఉండ‌ద‌న్నారు. అయితే ఆ ప్రాజెక్టులో ల్యాండ‌ర్‌, రోవ‌ర్ ఉన్నాయ‌న్నారు.

File Image of Chandrayaan 2 Launch Pictures (Photo Credits: File Photo)

New Delhi, September 7: చందమామను జల్లెడ పట్టేందుకు చంద్ర‌యాన్-3 మిష‌న్‌ రెడీ (Chandrayaan-3) అవుతోంది. చ‌ంద్రుడిపైకి చంద్ర‌యాన్-3 మిష‌న్‌ను వ‌చ్చే ఏడాది ఆరంభంలోనే ప్ర‌యోగించ‌నున్న‌ట్లు భార‌త అంత‌రిక్ష శాఖ‌కు చెందిన స‌హాయ‌మంత్రి జితేంద్ర సింగ్ (Union Minister Jitendra Singh) తెలిపారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌యాన్-2తో పోలిస్తే చంద్ర‌యాన్‌-3 భిన్నంగా ఉంటుంద‌న్నారు. చంద్ర‌యాన్‌-3లో ఆర్బిట‌ర్ (Will Not Have Orbiter) ఉండ‌ద‌న్నారు. అయితే ఆ ప్రాజెక్టులో ల్యాండ‌ర్‌, రోవ‌ర్ ఉన్నాయ‌న్నారు.

2021 మొద‌ట్లోనే చంద్ర‌యాన్‌-3ను ప్ర‌యోగించ‌నున్న‌ట్లు చెప్పారు. చంద్ర‌యాన్‌-2ను (Chandrayaan-2) 2019లో ఇస్రో ప్ర‌యోగించిన విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి చంద్ర‌యాన్‌-3ని 2020లో లాంచ్ చేయాల‌నుకున్నారు. కానీ క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఆ ప్లాన్ ఆల‌స్య‌మ‌కైంది. లాక్‌డౌన్ వ‌ల్ల చంద్ర‌యాన్‌-3 ప్రాజెక్టు ప‌నులు నిలిచిపోయాయి. చంద్ర‌యాన్‌-2ను 2019 జూలై 22న ప్ర‌యోగించారు.

 చందమామ మీద ఫోటోలను విడుదల చేసిన ఇస్రో

సెప్టెంబ‌ర్ 7వ తేదీన విక్ర‌మ్ ల్యాండ‌ర్ చంద్రుడిపై కుప్ప‌కూలింది. కానీ ఆర్బిటార్ మాత్రం డేటాను పంపిస్తూనే ఉన్న‌ది. అయితే మ‌రోవైపు 2008లో ప్ర‌యోగించిన చంద్ర‌యాన్‌-1 పంపిన ఫోటోలు తాజాగా ఓ కొత్త విష‌యాన్ని తేల్చాయి. చంద్రుడి ద్రువాలు తుప్పుప‌ట్టిపోతున్న‌ట్లు ఆ ఫోటోలు వెల్ల‌డించాయి. నాసా శాస్త్ర‌వేత్త‌లు దీన్ని ద్రువీక‌రించారు.

Here's Minister of State for Space Dr Jitendra Singh Statement

చంద్రయాన్-2 మిగిల్చిన చేదు జ్ఙాపకాలను చెరిపేసుకుని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ప్రాజెక్టును చేపట్టింది. అయితే మూన్ మిషన్‌కు సంబంధించిన తాజా సమాచారాన్ని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. చంద్రయాన్-2కు ప్రత్యామ్నాయంగా ఇస్రో ఈ ప్రాజెక్టును చేపట్టిందని పేర్కొన్నారు.

చంద్రయాన్-2తో కథ ముగిసిపోలేదు, ఆదిత్య ఎల్1తో సత్తా చాటుతాం

చంద్రుడి కక్ష్యలో తిరిగడానికి వీలుగా ఆర్బిటర్‌ ఉండబోదని స్పష్టం చేశారు. చందమామపై దిగడానికి అనువుగా ల్యాండర్, ఉపరితలంపై తిరుగాడటానికి ఉద్దేశించిన రోవర్‌ మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. చంద్రయాన్-2 ఆర్బిటర్‌ను అనుసంధానించుకునేలా తాజా ప్రాజెక్టును చేపట్టామని, వచ్చే ఏడాది చివరిలో మరో ప్రాజెక్టు కూడా ఉంటుందని తెలిపారు.

చంద్రయాన్ 3 ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం, ఈ ఏడాది గగన్‌యాన్ ప్రాజెక్టు కూడా చేపట్టబోతున్నట్లు వెల్లడించిన ఇస్రో చైర్మన్ కే. శివన్

చంద్రయాన్‌-1 (Chandrayaan-1) ఇచ్చిన సమాచారం ప్రకారం.. చంద్రుడి ధృవాల వద్ద తుప్పు లాంటి పదార్థాలు కనిపిస్తున్నాయని, ఆ ప్రాంతాల్లో ఇనుము మిశ్రమం అధికంగా గల శిలలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారని జితేంద్ర సింగ్ చెప్పారు. నీళ్లు, ఆక్సిజన్ ఉన్నప్పుడే తుప్పు ఏర్పడటానికి అవకాశం ఉందని అంచనా వేశారని అన్నారు. నీళ్లు, ఆక్సిజన్‌ ఉన్నాయనడానికి పూర్తి ఆధారాలే లేవని, వాటి గురించి తెలుసుకోవడానికే జాబిల్లి ధృవాలపై దృష్టిని కేంద్రీకరించినట్లు ఆయన చెప్పారు. వాటి గురించి తెలుసుకోగలిగితే.. అంతరిక్ష ప్రయోగాల్లో మరో సువర్ణాధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టవుతుందని చెప్పారు.

చంద్రుడిపై ల్యాండింగ్ సమయంలో అవాంతరం. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్

తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి సంబంధించిన గగన్‌యాన్‌కు కూడా సన్నాహాలు సాగుతున్నాయని జితేంద్ర సింగ్ వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్ల గగన్‌యాన్‌ ప్రాజెక్టులో కొంత జాప్యం చోటు చేసుకుందని అన్నారు. అయినప్పటికీ.. ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళికల ప్రకారం.. నిర్ణీత సమయానికే ఆ ప్రాజెక్టును చేపట్టడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారని స్పష్టం చేశారు.