Nails-Cancer Link: మీ చేతి వేళ్ల గోళ్ల పైభాగంలో తెల్లని లేదా ఎర్రని చారలు కనిపిస్తున్నాయా? అయితే, అది క్యాన్సర్‌ కు సంకేతం కావొచ్చు.. అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనం ఏం చెప్పిందంటే?

ఆ పరిణామం మీలో క్యాన్సర్‌ వృద్ధి చెందుతుందనడానికి సంకేతం కావొచ్చు.

Nails (Credits: X)

Newdelhi, May 19: మీ చేతి వేళ్ల గోళ్ల (Nails) పైభాగంలో తెల్లని లేదా ఎర్రని చారలు కనిపిస్తున్నాయా? అయితే, లైట్ తీస్కోకండి. ఆ పరిణామం  మీలో క్యాన్సర్‌ (Cancer) వృద్ధి చెందుతుందనడానికి సంకేతం కావొచ్చు. ఈ మేరకు అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌) శాస్త్రవేత్తలు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. గోళ్ళపై ఏర్పడే ఈ చారలతో గోరు దళసరిగా మారుతుందని తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం.. గోళ్ల పైభాగంలో తెలుపు లేదా ఎరుపు రంగులో చారలు ఏర్పడే పరిస్థితి క్రమంగా అరుదైన వారసత్వ అస్వస్థత బీఏపీ1కు దారి తీయవచ్చు. ఈ క్త్రమంలో క్యాన్సర్ ట్యూమర్ల ముప్పు పెరగవచ్చు. ఈ చారలు కేవలం ఒక గోటిపైన మాత్రమే ఏర్పడుతాయని వెల్లడించింది.

తెలంగాణ ప్ర‌భుత్వానికి ఎన్నికల సంఘం షాక్, అనుమ‌తి రాక‌పోవ‌డంతో కేబినెట్ స‌మావేశం వాయిదా

ఈ తరహా క్యాన్సర్లకు సంకేతం

చేతి వేళ్ల గోళ్ల పైభాగంలో తెల్లని లేదా ఎర్రని చారలు కనిపిస్తే.. చర్మం, కళ్లు, మూత్ర పిండాల క్యాన్సర్ల ట్యూమర్లు వృద్ధి చెందుతున్నాయని అంచనా వేయొచ్చని పరిశోధకులు వెల్లడించారు.

రాబోతున్న వ‌ర్షాకాలం! కాళేశ్వ‌రం ప్రాజెక్టు రిపేర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీల‌క మీటింగ్, మ‌రోసారి క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయం