Chennai, Dec 17: డయాబెటిస్ (Diabetes) కు సంబంధించి శాస్త్రీయ పరిశోధనలను మరింత బలపరిచే లక్ష్యంతో ప్రజలకు సంబంధించిన జీవసంబంధ నమూనాలను భద్రపరిచే దేశంలోనే తొలి డయాబెటిస్ బయో బ్యాంకును (ICMR Diabetes Bio-Bank) భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) చెన్నైలో స్థాపించింది. మద్రాసు డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఎండీఆర్‌ఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో ఈ బయోబ్యాంకు ఏర్పడింది.ఐసీఎంఆర్ అనుమతితో శాస్త్రీయ పరిశోధనలకు ఈ బయోబ్యాంకు తోడ్పాటును అందిస్తుంది.
ICMR sets up India's first diabetes biobank in Chennai for research
Biobanks are critical in biomedical research, collecting, processing, storing and distributing biospecimens to support scientific researchhttps://t.co/Mmdx9qWODb pic.twitter.com/k1mHdrsIiw
— Aashish Chandorkar (@c_aashish) December 16, 2024
లక్ష్యాలు ఇవే..
- బయోస్పెసిమెన్ల సేకరణ
- బయోస్పెసిమెన్లను ప్రాసెస్ చేయడం
- బయోస్పెసిమెన్లను భద్రపరచడం-పంపిణీ చేయడం
ఏం పరిశోధనలు చేస్తారు?
డయాబెటిస్ వచ్చేందుకు కారణాలు, డయాబెటిస్ లో భారతీయ రకాలకు చెందిన తేడాలు, సంబంధిత రుగ్మతలను బయోబ్యాంకు సాయంతో ఆధునిక పరిశోధనలు జరుగుతాయి.