Newdelhi, May 28: డయాబెటిస్ (diabetes) చికిత్సలో చైనా పరిశోధకులు (China Scientists) కీలక ముందడుగు వేశారు. రోగి షుగర్ వ్యాధిని సంపూర్ణంగా నయం చేసి రికార్డు సృష్టించారు. క్లోమంలోని కణజాలంపై షుగర్ వ్యాధి ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నదో కృత్రిమ అల్గారిథమ్ ద్వారా తొలుత పరిశోధకులు విశ్లేషించారు. అనంతరం రోగి రక్తంలోని మూల కణాలను (సీడ్ సెల్స్) తీసుకొని సెల్ థెరపీతో వాటిలో కొన్ని మార్పులు చేస్తారు. తర్వాత క్లోమంలో ప్రభావితం అయిన కణాల స్థానంలో వీటిని (సెల్ ట్రాన్స్ ప్లాంట్) ప్రవేశపెట్టారు. అలా క్రమంగా రోగికి ఇచ్చే ఇన్సులిన్, ఇతరత్రా మందుల మోతాదును తగ్గించారు.
diabetes cure: Chinese scientists develop cure for diabetes, insulin patient becomes medicine-free in just 3 months - The Economic Times https://t.co/btwl1LqhyL
— Jennifer Stanley (@JennWrenStanley) May 27, 2024
11 వారాల వ్యవధిలోనే ..
2021 జూలైలో తొలుత ఓ రోగికి ఇలా ‘సెల్ ట్రాన్స్ ప్లాంట్’ చేశామని, 11 వారాల వ్యవధిలోనే అతను ఇన్సులిన్, ఇతరత్రా మందుల వాడకాన్ని పూర్తిగా మానేశాడని చైనా పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం అతడికి డయాబెటిస్ సంపూర్ణంగా నయమైనట్టు వెల్లడించారు. గడిచిన 33 నెలలుగా సదరు వ్యక్తి ఇన్సులిన్ తీసుకోవట్లేదని వివరించారు.