agriculture (photo-ANI)

Newdelhi, Dec 15: దేశంలోని అన్నదాతలకు (Farmers) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) (RBI) శుభవార్త చెప్పింది. వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి తాకట్టు లేకుండా అన్నదాతలకు రూ.2 లక్షల వరకూ రుణాన్ని ఇవ్వనున్నట్టు వెల్లడించింది.  వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తాజాగా ఆర్బీఐ స్పష్టం చేసింది. వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నందున రైతులకు రుణ సదుపాయం మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్యల వల్ల చిన్న, సన్నకారు రైతులైన 86 శాతం మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. ఈ క్రమంలోనే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

నేడు, రేపు గ్రూప్‌-2 పరీక్షలు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30వరకు రెండో సెషన్‌

ఇప్పుడు లిమిట్ ఎంత ఉంది?

ప్రస్తుతం రైతులకు ఎలాంటి తనఖా లేకుండా రూ.1.6 లక్షల వరకూ రుణం తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఇది అన్నదాతల అవసరాలకు సరిపోవడం లేదు.  పంట సాగుకు రైతులు పెడుతున్న ఖర్చులను, ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిశీలించిన ఆర్బీఐ తనఖా లేకుండా ఇచ్చే రుణ పరిమితిని తాజాగా రూ. 2 లక్షలకు పెంచింది.

అల్లు అర్జున్‌కు సీఎం చంద్రబాబు ఫోన్, అరెస్ట్‌పై ఆరా, బన్నీ ఇంటికి క్యూ కడుతున్న హీరోలు