Aliens: ఏండ్లుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా? నాసాకు యూఏఎఫ్ స్టడీ టీమ్ సంచలన రిపోర్టు ఇచ్చింది. ఆ నివేదికలో ఏమున్నదంటే?
గ్రహాంతర జీవులు (ఏలియన్స్) ఉన్నట్టు తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవంటూనే అన్ ఐడెంటిఫైడ్ అనోమలస్ ఫినామినా (యూఏఎఫ్)లపై పరిశోధనలు చేసేందుకు పరిశోధకుల బృందాన్ని అమెరికా ఏర్పాటు చేసింది.
Newdelhi, Sep 15: గ్రహాంతర జీవులు (ఏలియన్స్) (Aliens) ఉన్నట్టు తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవంటూనే అన్ ఐడెంటిఫైడ్ అనోమలస్ ఫినామినా (యూఏఎఫ్-UAF)లపై పరిశోధనలు చేసేందుకు పరిశోధకుల బృందాన్ని అమెరికా ఏర్పాటు చేసింది. అన్ ఐడెంటి ఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ (యూఎఫ్‌వో) (UFO)ల గురించి పరిశోధనలు చేసేందుకు గతంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఏర్పాటు చేసిన యూఎఫ్‌వో స్టడీ టీం తన నివేదికను గురువారం నాసాకు సమర్పిచింది. గ్రహాంతర జీవులు, యూఎఫ్‌వోల గురించి సరైన సాక్ష్యాధారాలు తమకు లభించలేదని ఈ నివేదిక వెల్లడించింది. అయితే ఆధారాలు లభించలేదని చెబుతూనే అదే టీంను తాజాగా యూఏఎఫ్‌లపై పరిశోధనలు చేసేందుకు నియమించడంపై పలువురు విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు విశ్వంలో ఏదో ఒక చోట కచ్చితంగా జీవం ఉండొచ్చని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ పేర్కొనడం దానికి బలాన్ని చేకూరుస్తున్నది.
ఇప్పటికీ అనుమానాలే
యూఏఎఫ్‌లను చూశామని కొందరు చెప్పినప్పటికీ, అందుకు తగిన సాక్ష్యాలు లేవని నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ నికోలా ఫ్యాక్స్ పేర్కొన్నారు. ఇటీవల పలువురు అమెరికా మాజీ ఇంటెలిజెన్స్, ఆర్మీ అధికారులు, శాస్త్రవేత్తలు యూఏఎఫ్‌లను చూసినట్టు చెప్పడంతో ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.