Chandrapur, April 03: మహారాష్ట్ర – తెలంగాణ సరిహద్దు వద్ద చంద్రపూర్ సమీపంలో ఆకాశంలో నుంచి జారిపడ్డ వస్తువులకు సంబంధించి మిస్టరీ (Mystery) వీడిండి. ఈ ఖగోళ వస్తువులను చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.శనివారం రాత్రి సుమారు 7:30గంటల ప్రాంతంలో నిప్పులు చిందిస్తూ కొన్ని వస్తువులు ఆకాశం నుండి భూమిపై (Fall from Sky) పడ్డాయి. అది చూసిన ప్రజలు ఉల్కపాతం (Meteors) సంభవించి ఉండొచ్చని భావించారు. మండుతున్న వస్తువులు అలా జారిపడుతుండగా కొందరు వీడియోలు కూడా తీశారు. అలా మండుతూ భూమికి చేరిన కొన్ని వస్తువులు చంద్రాపూర్ జిల్లాలోని (Chandrapur) సిదేవాహి తాలూకాలోని లాడ్‌బోరి వద్ద గ్రామ పంచాయతీ కార్యాలయం వెనుక పడ్డాయి. ఆదివారం ఉదయం గుండ్రంగా ఉన్న ఇనుప వస్తువును గమనించిన స్థానికులు అక్కడి రెవిన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Maharashtra | Yesterday night we received information about a 3-metre ring being found in a village in Sindewahi. Ring was hot & seemed like it has fallen from sky while spherical object was found in another village today morning: Ganesh Jagdale, Tehsildar, Sindewahi, Chandrapur pic.twitter.com/WhHl8c7257
— ANI (@ANI) April 3, 2022
అధికారుల సమాచారంతో లాడ్‌బోరి గ్రామానికి చేరుకున్న ఔరంగాబాద్ ఖగోళ విజ్ఞాన కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్..అవి ఉల్కా – ఖగోళ శాఖలాలు (space debris) కాదని, ఎలక్ట్రానిక్ రాకెట్ బూస్టర్ ముక్కలుగా గుర్తించారు. దింతో శనివారం రాత్రి ఆకాశం నుంచి జారిపడ్డ వస్తువులు ఉల్కలు కాదని రాకెట్ అవశేషాలని (rocket boosters) చెప్పుకొచ్చారు.
న్యూజిలాండ్‌లోని మహియా ద్వీపకల్పంలో ఉన్న రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి శనివారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం)6.11 గంటల సమయంలో రాకెట్ ల్యాబ్ అనే కంపెనీ తమ ఎలక్ట్రాన్ రాకెట్ ద్వారా బ్లాక్‌స్కై అనే ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రయోగించింది. ఆ సమయంలో అంతరిక్షంలోకి ప్రయోగించిన రాకెట్ ఇదొక్కటేనని, మహారాష్ట్రలో ఆకాశం నుంచి రాలిపడుతున్నట్లు కనిపించినవి ఈ ఎలక్ట్రాన్ రాకెట్ బూస్టర్ పరికరాలేనని శ్రీనివాస్ వెల్లడించారు.
అయితే భారీగా ఉల్కాపాతం జరిగిందని, దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఆ చుట్టుపక్కల గ్రామస్తులు మాత్రం చాలా భయాందోళనలకు గురయ్యారు. తమ ఇళ్లు ఎక్కడ ధ్వంసం అవుతాయో అని భయపడ్డారు. కానీ అవి రాకెట్‌కు చెందిన పార్ట్స్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.