PSLV-C49 Rocket: పీఎస్‌ఎల్‌వీ సి49 ప్రయోగం విజయవంతం, EOS-01 సహా మరో 9 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో
PSLV-C49 (Photo Credits: @isro)

Sriharikota, November 7: శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పిఎస్‌ఎల్‌వి సి49 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన 51వ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. క్యారియర్ వాహనం పిఎస్‌ఎల్‌వి సి-49 ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు ఇండియాకు చెందిన EOS-01 ఉపగ్రహంతో పాటు మరో 9 విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ 9 కస్టమర్ ఉపగ్రహాలు లిథువేనియా (1), లక్సెంబర్గ్ (4) మరియు యుఎస్ఎ (4) దేశాలకు చెందినవి.

అంతరిక్ష శాఖ న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) తో వాణిజ్య ఒప్పందం ప్రకారం ఇంటర్నేషనల్ కస్టమర్ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నట్లు ఇస్రో తెలిపింది.

EOS-01 ప్రయోగానికి కౌంట్‌డౌన్ నవంబర్ 6 న ప్రారంభమైంది. పిఎస్ఎల్వి-సి 49 ప్రయోగం ఈరోజు 15:02 గంటలు IST కి షెడ్యూల్ చేయబడింది, అయితే వాతావరణంలో మార్పుల కారణంగా ప్రయోగ సమయాన్ని 15:12 గంటలకు మార్చారు.

PSLV-C49 Rocket, Carrying EOS-01 Satellite, Lifts Off Success

ఇక ఈరోజు భారత్ ప్రయోగించిన ఉపగ్రహం EOS-01 విషయానికి వస్తే, ఇది దేశానికి సంబంధించిన భూతల పరిశీలన, వ్యవసాయం, అటవీ మరియు విపత్తు నిర్వహణ మొదలకు తదితర సేవలకు ఉద్దేశించబడింది.

2020లో ఇస్రో చేసిన మొదటి మిషన్ ఇది. కరోనావైరస్ (కోవిడ్ -19) వ్యాప్తి నేపథ్యంలో ప్రయోగ సమయంలో స్పేస్ సెంటర్ వద్ద వీక్షకులకు అనుమతి నిషేధించబడింది. అలాగే ఈ కొవిడ్ సమయాల్లో ఇస్రో సిబ్బంది అన్ని సవాళ్లను అధిగమించి అసాధ్యమనుకున్న దాన్ని సైతం సుసాధ్యం చేసి మరోసారి తన ఘనత చాటుకుంది.