ఇటీవల చైనా ఫెయిల్ అయిన ప్రయోగం వల్ల అలాంటి ఓ పెను ప్రమాదమే జరగబోయింది. అంతరిక్షంలోకి ఎన్నో రాకెట్లు వెళ్తూ ఉంటాయి. అయితే వాటి పని పూర్తయిన తర్వాత వాటి వ్యర్థాలను ఏ ప్రమాదం లేకుండా స్మాష్ చేసే బాధ్యతను పరిశోధకులు చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు. అయితే తాజాగా అలాంటి వ్యర్థాలు అన్నీ కలిసి చంద్రుడికి ముప్పులాగా మారాయి.అంతే కాకుండా అవి అన్నీ కలిసి చంద్రుడిని ఢీ కొట్టే వరకు వెళ్లాయి. తాజాగా అంతరిక్షంలో తిరుగుతున్న ఓ రాకెట్‌కు సంబంధించిన వ్యర్థం చంద్రుడికి చాలా దగ్గరగా వెళ్లింది. గంటకు 9,300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది.

ఏపీలో కొత్తగా 101 మందికి కరోనా, పశ్చిమ గోదావరి జిల్లాలో 28, అనంతపురం జిల్లాలో 17, గుంటూరు జిల్లాలో 13 కేసులు

ఆ వేగానికి చంద్రుడిపై ఉన్న ధూళి ఒక్కసారిగా పైకెగసింది. ఇంత జరిగినా కూడా పరిశోధకుల టెలిస్కోపులకు ఈ రాకెట్ శకలం చిక్కలేదు. చంద్రుడిపై ఎగిసిన ధూళి వల్లే వారంతా అలర్ట్ అయ్యారు. చంద్రుడిపై ధూళి ఎందుకలా ఎగిసిందని గమనించగా.. అది రాకెట్ శకలం వల్ల జరిగిన ప్రమాదమని వారికి అర్థమయ్యింది. ఇప్పటికే చంద్రుడి చుట్టూ 3 టన్నుల వ్యర్థాలు గోడలాగా ఉన్నాయి. ఆ రాకెట్ శకలం వెళ్లిన వేగానికి ఈ వ్యర్థాల గోడకు బీటలు వచ్చి ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 2014 చైనా నుండి వెళ్లిన రాకెట్ శకలం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు అంచనా వేస్తున్నారు.