Talcum Powder Ovarian Cancer Link: అలర్ట్.. ఇంట్లో టాల్కమ్ పౌడర్ వాడుతున్నారా? అయితే, మీకు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.. అమెరికా పరిశోధకుల హెచ్చరిక.. మహిళలు జననాంగాల్లో టాల్కమ్ పౌడర్ వాడొద్దని సూచన.. ఇంతకీ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే??
అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు ఈ మేరకు వెల్లడించారు.
Newdelhi, May 21: ఇంట్లో రోజూ అందరం వాడే టాల్కమ్ పౌడర్ (Talcum Powder) తో మహిళల్లో అండాశయ క్యాన్సర్ వచ్చే (Ovarian Cancer) ప్రమాదం ఉన్నది. అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు ఈ మేరకు వెల్లడించారు. రహస్య అవయవాలపై టాల్కమ్ పౌడర్ ను తరుచుగా వాడే మహిళల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు వివరించారు. మహిళలు జననాంగాల్లో టాల్కమ్ పౌడర్ వినియోగాన్ని నిలిపివేయాలని సూచించారు. 2003-2009 మధ్య అమెరికాలోని 50,884 మంది మహిళలపై ఈ పరిశోధనలు చేసినట్టు వివరించారు.
కారణమేంటంటే?
టాల్కమ్ పౌడర్ లో ఆస్బెస్టాస్ అనే ఖనిజాన్ని వినియోగిస్తారు. ఇది క్యాన్సర్ కు కారకంగా పనిచేస్తుందని, దీన్ని పీల్చినా కూడా ప్రమాదమేనని పరిశోధకులు చెబుతున్నారు. ఆస్బెస్టాస్ లేని టాల్కమ్ పౌడర్ తో పెద్దగా ప్రమాదం ఉండబోదని పేర్కొన్నారు. కాగా, జాన్సన్ బేబీ పౌడర్ లో క్యాన్సర్ కలిగించే పదార్థాలు ఉన్నట్టు వివాదం రేగడం తెలిసిందే.