Rains (Credits: Pixabay)

Hyderabad, May 21: తెలంగాణ (Telangana) రైతన్నలకు (Farmers) శుభవార్త. జూన్ 5 - 11 మధ్యలో రాష్ట్రంలోకి రుతుపవనాలు (Monsoon) ప్రవేశించనున్నాయి. ఈ మేరకు  వాతావరణ శాఖ ప్రకటించింది. తొలుత కేరళను తాకనున్న రుతుపవనాలు అక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణ చేరుకోవడానికి అయిదారు రోజుల సమయం పడుతుంది. ఈసారి నైరుతి గమనం సానుకూలంగానే ఉండబోతోందని వాతావరణ శాఖ తెలిపింది. గతేడాది కేరళను జూన్ 11న తాకిన రుతుపవనాలు తెలంగాణలో 20నాటికి విస్తరించిన విషయం తెలిసిందే.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌, తెలంగాణ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలు ఇవిగో..

కారణం ఇదే?

ఈసారి నైరుతి గమనం సానుకూలంగా ఉండటానికి కారణం.. మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండటమేనని శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

చేప ప్రసాదం పంపిణీ తేదీలు ఇవిగో, జూన్‌ 8 ఉదయం 11 నుంచి జూన్‌ 9 ఉదయం 11 గంటల వరకు, నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పంపిణీ