Octopus: ఈ భూమి మీద మానవజాతి అంతరించిపోతే, ఆ ఒక్క జీవే మిగిలి ఉంటుందట.. ఏంటా సంగతి??
ఈ నేపథ్యంలో ఒకవేళ మనుషులు పూర్తిగా అంతరించిపోతే ఈ భూమిపై ఆధిపత్యం ఎవరిది? అనే ప్రశ్నపై కొందరు శాస్త్రవేత్తలు పరిశీలన జరిపారు.
Newdelhi, Nov 17: మారుతున్న వాతావరణ పరిస్థితులు, మనవ చర్యలు వెరసి మానవజాతి మనుగడకు అన్ని వైపుల నుంచి ముప్పు ఎదురవుతున్నది. ఈ నేపథ్యంలో ఒకవేళ మనుషులు (Humans) పూర్తిగా అంతరించిపోతే ఈ భూమిపై ఆధిపత్యం ఎవరిది? అనే ప్రశ్నపై కొందరు శాస్త్రవేత్తలు పరిశీలన జరిపారు. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ టిమ్ కౌల్సన్ తెలిపిన వివరాల ప్రకారం.. మానవజాతి అంతరించిపోతే.. ఆక్టోపస్ (Octopus) ఈ భూమిపై ఆధిపత్యం సాధించగలదని తెలిసింది. అంతేకాదు.. ఈ ఆక్టోపస్ లు పరస్పరం భావ వ్యక్తీకరణ చేసుకోగలవట.
మణిపూర్ సీఎం నివాసంపై దాడి, మరోసారి రణరంగంగా మారిన ఇంఫాల్, సీఎం బిరెన్ సింగ్ సురక్షితం
అందుకే ఆధిపత్యం..
ఆక్టోపస్ లు చాలా తెలివైన జీవులు. పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మలచుకోగలవు. దేనినైనా ఉపయోగించుకోగలిగే సామర్థ్యం కలవి. వాస్తవ, వర్చువల్ వస్తువుల మధ్య తేడాను గుర్తించగలవు. తమ చుట్టూ ఉన్న పరిసరాలకు అనుగుణంగా ప్రవర్తించగలవు. లోతైన సముద్రాల్లోనూ, తీర ప్రాంతాల్లోనూ జీవించగలవు. ఈ లక్షణాలే ప్రపంచంపై ఈ జీవులకు ఆధిపత్యాన్ని కట్టబెట్టాయని కౌల్సన్ వివరించారు.