IPL Auction 2025 Live

Twitter New Rules: ట్విట్టర్ లో కొత్త నిబంధనలు.. రోజుకు వెయ్యి ట్వీట్లే చూడొచ్చు.. కొత్త ఖాతా దారులకు 500 ట్వీట్లు మాత్రమే.. ఎలాన్ మస్క్ తాజా నిర్ణయం వెనుక కారణం ఏంటంటే?

ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను ఆధీనంలోకి తీసుకున్న తర్వాత కొత్త మార్పులు చాలా వచ్చాయి. ఇప్పుడు ఇదీ అలాంటిదే.

Elon Musk and Twitter. (Photo credits Wikimedia Commons/ Twitter)

Newdelhi, July 2: సామాజిక మాధ్యమం ట్విట్టర్ (Twitter) పిట్ట కూయందే రోజు గొడవని పరిస్థితి. ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ ను ఆధీనంలోకి తీసుకున్న తర్వాత కొత్త మార్పులు చాలా వచ్చాయి. ఇప్పుడు ఇదీ అలాంటిదే. తాజా నిబంధన ప్రకారం..  ట్విట్టర్ యూజర్లు ఇతరుల ట్వీట్లను (Tweets) చూడాలంటే అకౌంట్ లో (Account) తప్పనిసరిగా లాగిన్ (Login) అవ్వాల్సి ఉంటుంది. ఇది వరకు లాగిన్ అవ్వకపోయనా.. వెబ్ బ్రౌజర్ ద్వారా ఇతర ఖాతాదారుల ట్వీట్లను చూసే అవకాశం ఉండేది. ట్విట్టర్ ఖాతా లేకపోయినా.. లింక్ ను బ్రౌజర్ లో ఓపెన్ చేసి చూసే వీలు ఉండేది. కానీ, ఈ సౌకర్యాన్ని ట్విట్టర్ నిలిపివేసింది. ఖాతాదారులు లాగిన్‌ అవుతూనే ఇతరుల వివరాలు చూడొచ్చు. అకౌంట్ లేని వారు క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Congress Bhatti Vikramarka: కాంగ్రెస్‌ను తిట్టినోల్లే పార్టీలో ఉన్నారు షర్మిల వస్తే తప్పేంటి... రేవంత్ మీద భట్టి విమర్శలు

ఎవరికి ఎంత పరిమితి అంటే?

ట్విటర్‌ అన్ వెరిఫైడ్ ఖాతాదారులు రోజుకు 1000 ట్వీట్లు మాత్రమే చూసే అవకాశం కల్పించాలని అధినేత ఎలాన్‌ మస్క్‌ నిర్ణయించారు. కొత్తగా ఖాతా తెరిచిన వారు రోజుకు కేవలం 500 ట్వీట్లు మాత్రమే చూసే విధంగా పరిమితి విధించారు. డబ్బులు చెల్లించి ఖాతాను వెరిఫై చేసుకున్న వారు రోజుకు 10 వేల పోస్టులు చూడొచ్చు. తొలుత వెరిఫైడ్ ఖాతాదారులకు 6000, అన్ వెరిఫైడ్ వారికి 600, కొత్త ఖాతాదారులకు 300 పోస్టుల లిమిట్ పెట్టిన ఎలాన్ మస్క్ కొన్ని గంటల తర్వాత దాన్ని సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ట్విట్టర్ నుంచి భారీ ఎత్తున డేటా చౌర్యం జరుగుతోందని, దాన్ని అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకున్నామని మస్క్‌ చెబుతున్నారు. ఈ నిబంధనలు తాత్కాలికంగా ఉంటాయని తెలిపారు.

Twitter Down: ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ డౌన్‌, వేల సంఖ్యలో ఫిర్యాదులు, ఎలాంటి ప్రకటన చేయని యాజమాన్యం, సోషల్ మీడియాలో ట్విట్టర్‌ పై మీమ్స్‌