Chrome Security Breach: గూగుల్ క్రోమ్, జూమ్ వాడుతున్నారా? మీ ఫోన్, ల్యాప్‌టాప్ డేంజర్‌లో ఉన్నాయి, వెంటనే ఈ పని చేయకపోతే ఇక అంతే! క్రోమ్ యూజర్లకు అలర్ట్ జారీ చేసిన గూగుల్, ఈ స్టెప్స్ ఫాలో అయితే క్రోమ్ సేఫ్
సాంకేతిక దిగ్గజం వినియోగదారు డివైజ్‌లకు హాని కలిగించే బగ్ గురించి హెచ్చరిస్తోంది. CVE-2022-3723 అనే కోడ్ ద్వారా డేటా ముప్పు పొంచి ఉందని Google కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. అవాస్ట్ సెక్యూరిటీ పరిశోధకులు ఈ CVE-2022-3723 కోడ్ గుర్తించారు.
New Delhi, NOV 02: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే ఇంటర్నెట్ బ్రౌజర్‌లలో Google Chrome ఒకటి. ఈ బ్రౌజర్ (Browser) వినియోగదారుల కోసం క్రోమ్ చాలా ఆసక్తికరమైన ఫీచర్లతో వస్తుంది. లేటెస్టుగా క్రోమ్ యూజర్లకు గూగుల్ హై-సెక్యూరిటీ (High Security) వార్నింగ్ జారీ చేసింది. సాంకేతిక దిగ్గజం వినియోగదారు డివైజ్‌లకు హాని కలిగించే బగ్ గురించి హెచ్చరిస్తోంది. CVE-2022-3723 అనే కోడ్ ద్వారా డేటా ముప్పు పొంచి ఉందని Google కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. అవాస్ట్ సెక్యూరిటీ పరిశోధకులు ఈ CVE-2022-3723 కోడ్ గుర్తించారు. ఇది Chrome V8 జావాస్క్రిప్ట్ ఇంజిన్‌తో కలిగే type confusion ఇష్యూ అని చెప్పవచ్చు. థ్రెట్ యాక్టర్స్ ద్వారా బాధితుడి డివైజ్ నుంచి సిస్టమ్‌కు యాక్సెస్‌ను అందించే ఆర్బిటరీ కోడ్‌ని అమలు చేసేందుకు ఈ టైప్ కన్ఫ్యూజన్ ఎర్రర్‌ను ఉపయోగించుకోవచ్చు.
గూగుల్ (Google) ఈ సెక్యూరిటీ లోపానికి సంబంధించి వివరాలను గోప్యంగా ఉంచినప్పటికీ.. దానికి సంబంధించిన ఫిక్స్‌ను రిలీజ్ చేసింది. కంపెనీ Google Chrome కోసం స్టేబుల్ ఛానెల్‌ని Mac, Linux కోసం 107.0.5304.87కి Windows కోసం 107.0.5304.87/.88కి అప్‌డేట్ చేసింది.
హానికరమైన బగ్ (Bug) నుంచి తమ ల్యాప్‌టాప్‌లను సురక్షితంగా ఉంచడానికి వినియోగదారులు లేటెస్ట్ వెర్షన్‌ను రిలీజ్ చేసిన వెంటనే దానికి అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. రాబోయే వారాలు/రోజుల్లో ఈ అప్‌డేట్‌ను విడుదల చేస్తామని గూగుల్ చెబుతోంది. సెక్యూరిటీ బగ్‌లు స్టేబుల్ ఛానెల్‌కు చేరకుండా నిరోధించడానికి డెవలప్‌మెంట్ సైకిల్‌లోపనిచేసిన భద్రతా పరిశోధకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని గూగుల్ బ్లాగ్‌లో పేర్కొంది. దీంతో పాటూ జూమ్ యాప్ లో కూడా ఇదే తరహా అప్‌డేట్ ను ఇచ్చారు.
Google Chromeని ఎలా అప్‌డేట్ చేయాలి?
మీ ల్యాప్‌టాప్‌లో Google Chromeని అప్ డేట్ చేయడానికి ఈ దశలను ఫాలో అవ్వండి.
– మీ కంప్యూటర్‌లో Google Chromeని ఓపెన్ చేయండి.
– మీ స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉంచిన మూడు డాట్స్‌పై Click చేయండి.
– Menu List నుంచి ‘Help‘పై ఉంచండి.
– మీరు ‘Google Chrome గురించి’ చూస్తారు. దానిపై క్లిక్ చేయండి.
– మీ డివైజ్‌లో రన్ చేస్తున్న Chrome వెర్షన్ వివరాలతో కొత్త వెబ్‌పేజీని ఓపెన్ చేస్తుంది.
– మీ Google chrome వెర్షన్ లేటెస్టుగా లేకుంటే, ‘Google Chromeని అప్‌డేట్’ ఆప్షన్ కనిపిస్తుంది.