Credit @ Twitter

New York, OCT 30: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‭ను (Twitter) ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) కొనుగోలు చేయడం పట్ల బహుశా కొంత మంది అసంతృప్తితో ఉండవచ్చు. ట్విట్టర్ సీఈవోగా జాక్ డోర్సే పదవీ విరమణ తీసుకున్నప్పుడే చాలా మంది బాహాటంగానే తమ అసంతృప్తిని, విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఇక ట్విట్టర్‭కు తాము దూరమంటూ ప్రకటించిన వారు కూడా లేకపోలేదు. ఇలాంటి వారి కోసం ఒక గుడ్ న్యూస్. ట్విట్టర్ కో-ఫౌండర్ అయిన జాక్ డోర్సే (Jack Dorsey) నూతన సామాజిక మీడియా వేదికను ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉన్నారట. మరి కొద్ది రోజుల్లో కొత్త సోషల్ మీడియా వేదిక (social app) అందుబాటులోకి రానున్నట్లు కూడా చెప్తున్నారు. యాప్ ద్వారా తీసుకు రానున్న ఈ కొత్త సోషల్ మీడియా వేదిక పేరు ‘బ్లూస్కీ’ (Bluesky)అని ఖరారు చేశారు. ప్రస్తుతం ఇది బీటా పరీక్షలో ఉందని, ప్రోటోకాల్ స్పెక్స్‭పై మళ్లడం లాంటి విషయాలపై పరీక్ష కొనసాగుతున్నట్లు అని కంపెనీ మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

'The Bird Is Freed': పూర్తయిన డీల్, ట్విట్టర్ పిట్టకు విముక్తి లభించిందంటూ వైరల్ ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్, రాగానే సంచలన నిర్ణయం తీసుకున్న టెస్లా అధినేత 

నెట్‭వర్క్ అమలు చేసిన తర్వాత దానికి అనేక విభాగాల నుంచి సమన్వయం అవసరమని, అయితే అందులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పరిష్కరించేందుకు ఈ వేదికను బీటాలో (Beta) ప్రారంభించనున్నట్లు తెలిపారు. వారం రోజుల క్రితం డోర్సే (Jack Dorsey) ట్విట్టర్ వేదికగా ద్వారా స్పందిస్తూ సోషల్ మీడియా (Social media) లేదంటే దానిని ఉపయోగించే వ్యక్తుల డేటా కోసం అంతర్లీన ఫండమెంటల్స్‌ను స్వంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఏదైనా కంపెనీకి పోటీదారుగా ఉండాలని తాము భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

Diwali 2022: ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ వైరల్ ట్వీట్, హ్యాపీ దివాళీ అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిన కుక్ 

సోషల్ మీడియా దిగ్గజం కోసం ఇదే విధమైన వికేంద్రీకృత భావనను అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి బ్లూస్కీని మొదట 2019లో ట్విట్టర్ స్థాపించింది. డోర్సే మే 2022లో ట్విట్టర్ బోర్డు నుండి తప్పుకున్నారు. నవంబర్ 2021లో ట్విట్టర్ సీఈవో పదవి నుండి తప్పుకున్నారు.