Nepal Bus Tragedy: నేపాల్ లో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడటంతో నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు.. 65 మంది గల్లంతు (వీడియోలతో)
కొండచరియలు విరిగిపడటంతో ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు నదిలో కొట్టుకుపోయాయి.
Newdelhi, July 12: పొరుగు దేశం నేపాల్ లో ఘోరం జరిగింది. కొండచరియలు (Landslide) విరిగిపడటంతో ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు నదిలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో మొత్తం 65 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. అసలేం జరిగిందంటే.. ఏంజెల్ బస్సు, గణపతి డీలక్స్ బస్సు నేపాల్ రాజధాని కాట్మండూకి వెళ్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం వేకువజామున 3 గంటలకు సెంట్రల్ నేపాల్ లోని మదన్-ఆష్రిత్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. అదే సమయంలో అటువైపు వెళ్తున్న ఈ రెండు బస్సులు అదుపుతప్పి త్రిశూలి నదిలో పడిపోయాయి. నదీ ప్రవాహ తీవ్రతతో అవి రెండు కొట్టుకుపోయాయి. ఇందులో ఓ బస్సులో 24 మంది ఉండగా, మరో బస్సులో 41 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు.
వానతో సహాయక చర్యలకు ఆటంకం
గల్లంతైనవారికోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. అయితే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నదని తెలిపారు.