USA Tornadoes: అమెరికాలో టోర్నడో బీభత్సం.. 21 మంది మృతి.. టోర్నడో ప్రభావానికి గురైన 50 మిలియన్ల మంది.. బొమ్మల్లా ఎగిరిపోయిన కార్లు, కుప్పకూలిన భవనాలు

వందల సంఖ్యలో గాయపడ్డారు. టోర్నడో కారణంగా బలమైన సుడి గాలులు వీస్తూ, భారీ వర్షాలు కురుస్తూ పట్టణాలు, నగరాలను ముంచెత్తుతున్నాయి.

Tornado

Newyork, April 2: దక్షిణ మధ్య, తూర్పు అమెరికాలో (America) టోర్నడో (Tornado) బీభత్సానికి 21 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. టోర్నడో కారణంగా బలమైన సుడి గాలులు వీస్తూ, భారీ వర్షాలు  (Heavy Rains) కురుస్తూ పట్టణాలు, నగరాలను ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇల్లినాయిస్‌లో మరో నలుగురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 21కి పెరిగింది. టోర్నడో ప్రభావం టెనెస్సీ కౌంటీలో ఎక్కువగా ఉంది.

Costumes Krishna Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత.. అనారోగ్య కారణాలతో చెన్నై ఆసుపత్రిలో మృతి

దాదాపు 50 మిలియన్ల మందికిపైగా టోర్నడో ప్రభావానికి గురైనట్టు ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. అక్కడ వాహనాలు బొమ్మల్లా ఎగిరిపోగా, భవనాలు కుప్పకూలాయి. చెట్లు కుప్పకూలాయి. దాదాపు 8 రాష్ట్రాల్లో టోర్నడో ప్రభావం కనిపించింది.

Tirupati Horror: కారులో వెళ్తున్న సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్‌పై పెట్రోలు పోసి నిప్పటించిన దుండగులు.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఘటన



సంబంధిత వార్తలు