Kentucky Tornadoes: అమెరికాలో టోర్నడోల బీభత్సం, దాదాపు 80 మంది మృతి, ఎటు చూసినా విధ్వంమే, కెంటకీలో అత్యవసర పరిస్థితి విధింపు, కుప్పకూలిన భారీ భవనాలు

Kentucky December 12: అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో టోర్నడోలు(Tornadoes) బీభత్సం సృష్టించాయి. కెంటకీ(Kentucky )తో పాటూ పలు రాష్ట్రాల్లో టోర్నడోలు సృష్టించిన విధ్వంసంతో 80 మందికి పైగా మృతి చెందినట్లు అధికారవర్గాలు ప్రకటించారు. పదుల సంఖ్యలో ప్రజలు గలంతయ్యారు. ముఖ్యంగా కెంటకీ(Kentucky)లో టోర్నడోల ప్రభావం అధికంగా ఉంది. కేవలం ఒక్క కెంట(Kentucky)కీ రాష్ట్రంలోనే టోర్నడోల కారణంగా 70 మందికి పైగా మరణించారు. ఇక ఎడ్ వర్డ్స్ విల్లేలోని అమెజాన్ వేర్‌హౌజ్‌(Amazon warehouse) కుప్పకూలింది. దీంతో ఆరుగురు ఉద్యోగులు మృతి చెందారు.

కొవ్వొత్తుల ఫ్యాక్టరీ పైకప్పు కుప్పకూలటంతో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో 110 మంది ఆ కర్మాగారంలో ఉన్నారు. సహాయక చర్యల కోసం 180 మంది సిబ్బందిని రంగంలోకి దించామని, శిథిలాల తొలగింపు కొనసాగుతోందని కెంటకీ గవర్నర్ చెప్పారు.

కెంటకీ(Kentucky)లోని బౌలింగ్‌ గ్రీన్‌ ప్రాంతంలో అనేక అపార్ట్‌మెంట్లు భారీగా దెబ్బతిన్నాయి. కొన్ని కర్మాగారాలు కూలిపోయాయి. రహదారులపై శిథిలాలు పడి ఉండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. టోర్నడో ప్రభావం ఆరు రాష్ట్రాలపై పడింది. ఇల్లినోయీలో అమెజాన్‌ గిడ్డంగి పైకప్పు ఎగిరిపోయి, భారీ గోడ కూలిపోయింది. అలాస్కాలో ఓ నర్సింగ్‌హోం దెబ్బతింది. పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి. మిస్సౌరి, మిసిసిపి, ఆర్కాన్సాస్‌, టెన్నెసీలపైనా టోర్నడో విరుచుకుపడింది. విద్యుత్తు సరఫరా స్తంభించిపోయి దాదాపు 3 లక్షలమంది అంధకారంలో చిక్కుకుపోయారు. అత్యవసరమైతే తప్పిస్తే బయటకు రావద్దని పలుచోట్ల అధికారులు విజ్ఞప్తి చేశారు. దేశాధ్యక్షుడు జో బైడెన్‌ తాజా పరిస్థితిని సమీక్షించారు.