Cyclone Michaung Landfall Process Starts in Andhra Pradesh Coast (Photo Credits: X/@ANI)

Hyderabad, December 06: మిగ్ జామ్ తుఫాన్ (Cyclone) బాప‌ట్ల వ‌ద్ద తీరాన్ని దాటడంతో ఏపీ, త‌మిళ‌నాడుల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. అయితే తీరాన్ని దాటిన తుఫాను తీవ్ర‌వాయుగుండంగా మారింది. ఇప్పుడు అది ఈశాన్య తెలంగాణ వైపుగా పయ‌నిస్తూ వాయుగుండంగా (Depression) మారుతుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ (IMD) అధికారులు తెలిపారు. దీని ప్ర‌భావంతో తెలంగాణ‌తో పాటూ, ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని తెలిపారు.

 

అటు మిగ్ జామ్ తుపాన్ తీరాన్ని దాటినా ఆంధ్రా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపాన్ వల్ల పంటలు దెబ్బతిన్నాయి. భారీవర్షాల వల్ల రవాణా, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లకు అంతరాయం కలిగిందని ఆంధ్రా అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు హెచ్చరించారు.

 

పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం కూడా భారీ వర్షం కురిసింది. మిగ్ జామ్ తుఫాను వల్ల మూసివేసిన చెన్నై విమానాశ్రయం తిరిగి కార్యకలాపాలు ప్రారంభించింది. ఆంధ్రా తీర ప్రాంతంలో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. సహాయక బృందాలు నేలకూలిన చెట్లను తొలగిస్తున్నాయని ఆంధ్రా అధికారులు తెలిపారు. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు.