Bill Gates: మైక్రోసాఫ్ట్‌‌కు బిల్ గేట్స్ రాజీనామా, పూర్తిగా సామాజిక సేవ వైపు బిలియనీర్, 2014లో ఛైర్మెన్ పదవికి రాజీనామా, మిళిందా ఫౌండేషన్ ద్వారా సోషల్ సర్వీస్

ప్రస్తుతం బోర్డు సలహాదారుడిగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పూర్తిస్థాయిలో సామాజిక సేవలకు పరిమితమవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిల్ గేట్స్ ఇకపై మైక్రోసాఫ్ట్ (Microsoft) సలహాదారుగా కొనసాగనున్నారు. వారెన్ బఫెట్ కంపెనీ నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. ఈ విషయాన్ని సంస్థ శుక్రవారం ప్రకటించింది. ఇకపై బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు సాంకేతిక సలహాదారుగా కొనసాగనున్నారు.

Bill Gates on climate change (Photo Credits: Bill Gates YouTube)

New Delhi, Mar 14: ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ బిల్‌గేట్స్‌ (Bill Gates) మైక్రోసాఫ్ట్‌నుంచి వైదొలిగారు. ప్రస్తుతం బోర్డు సలహాదారుడిగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పూర్తిస్థాయిలో సామాజిక సేవలకు పరిమితమవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిల్ గేట్స్ ఇకపై మైక్రోసాఫ్ట్ (Microsoft) సలహాదారుగా కొనసాగనున్నారు. వారెన్ బఫెట్ కంపెనీ నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. ఈ విషయాన్ని సంస్థ శుక్రవారం ప్రకటించింది. ఇకపై బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు సాంకేతిక సలహాదారుగా కొనసాగనున్నారు.

బిల్ గేట్స్ ముచ్చట ఖరీదు రూ.4,600 కోట్లు

కాగా, 2014లో ఆయన మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌ పదవినుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. 2000లో సీఈఓ పదవికి రాజీనామా చేసిన ఆయన 2008నుంచి ఫుల్‌టైం పనికి కూడా గుడ్‌బై చెప్పారు. 1975లో మైక్రోసాఫ్ట్‌ను స్థాపించి దాన్ని ప్రపంచ నెంబర్‌ వన్‌ స్థాయికి తీసుకెళ్లారు. సామాజిక బాధ్యతతో ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మిళిందా ఫౌండేషన్ (Melinda Gates Foundation) పేరుతో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు అయిన మైక్రోసాఫ్ట్‌ (Microsoft) వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ (Bill Gates) ఈ మధ్య ఓ అద్భుతమైన షిప్ ను కొనుగోలు చేసిన సంగతి విదితమే. దాని ఖరీదు రూ.4600 కోట్లు. అత్యంత విలాసవంతమైన ఈ యాట్‌ (విహార నౌక)ను(Bill Gates Yacht) బిల్‌గేట్స్‌ 2019లో కొన్నారు.

బిల్‌గేట్స్ నా క్లాస్‌మేట్ అన్నందుకు నా పిల్లలు నన్ను లూజర్ అంటున్నారు

బిల్ గేట్స్ అక్టోబర్ 28, 1955 న వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్‌లో ఒక ధనవంతులు కుటుంబంలో జన్మించాడు. స్కూల్లో చదవుతున్నప్పటి నుంచే బిల్ గేట్స్‌కు లెక్కలు, సైన్స్ అంటే చాలా ఇష్టం. తన మిత్రుడు పాల్ అల్లెన్‌తో కలసి కంప్యూటర్ లాంగ్యేజి అయిన బేసిక్ (BASIC) నేర్చుకొని అందులో ప్రోగ్రాములు రాయడం మొదలు పెట్టాడు. 14 ఏళ్ళ వయసులో పాల్ అల్లెన్‌తో కలసి ట్రాఫిక్ లెక్కించే ప్రాసెసర్‌కు సంబంధించిన ప్రోగ్రాములు రాసి విక్రయించాడు. అలా బిల్ గేట్స్ ప్రయాణం మొదలయ్యింది.

1995 నుండి 2006 వరకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 2007 లెక్కల ప్రకారం బిల్ గేట్స్ ఆస్తి విలువ 58 బిలియన్ డాలర్లు. 2000 సంవత్సరంలో బిల్ గేట్స్ తన భార్యతో కలసి బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎయిడ్స్ నిర్మూలన, మూడవ ప్రపంచ దేశాలల్లో అంటువ్యాధుల నిర్మూలన, పేదవారికి విద్య వంటి సామాజికసేవలకు ధన సహాయం చేస్తున్నాడు.



సంబంధిత వార్తలు