Vjy, Jan 22: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) దావోస్ (Davos)లో మూడో రోజు (3rd day) పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు (World Economic Forum conference)లో వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నారు.యునీలీవర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సీకో, ఆస్ట్రా జెనెకా సంస్థల అధిపతులు, బిల్ గేట్స్, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధితోనూ సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు.
మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్‌గేట్స్‌తో చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు మైక్రో సాఫ్ట్ పెట్టడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని చంద్రబాబు గుర్తు చేశారు. దక్షిణ భారత్‌లో గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్‌వేగా నిలపాలని లోకేశ్ కోరారు. శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ, సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడవద్దు, నేతలకు ఆదేశాలు జారీ చేసిన జనసేన కేంద్ర కార్యాలయం
దావోస్ పర్యటనలో భాగంగా టెమాసెక్ హోల్డింగ్స్ భారత్ హెడ్ రవి లాంబాతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో టెమాసెక్ గ్రూప్ అనుబంధ సంస్థ క్యాపిటా ల్యాండ్ ద్వారా పారిశ్రామిక పార్కులు, డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. విశాఖ, తిరుపతిలో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయడంతో పాటు, పారిశ్రామిక క్లస్టర్లలో ఆర్‌ఈఐటీ విధానంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. సెంబ్ కార్ప్‌తో కలిసి రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. విశాఖ, తిరుపతిలో సెమాటెక్ టెలీమీడియా ద్వారా డేటా సెంటర్లు, డేటా సెంటర్ పార్కుల ఏర్పాటుకు సహకరించాలన్నారు.
కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పాల్గొన్నారు. దేశం ఒక యూనిట్‌గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీ, ఏఐ, రక్షణ రంగంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
రాష్ట్రాభివృద్ధిలో ‘సిస్కో’ భాగస్వామ్యంపై ఆ సంస్థ సీఈవో అండ్ చైర్మన్ చుర్‌రాబిన్స్‌తో చర్చించానని సీఎం చంద్రబాబు ‘ఎక్స్’లో వెల్లడించారు. ‘‘దావోస్‌లో మంగళవారం ‘గ్లోబల్ లీడర్స్ ఇన్ టెక్నాలజీ ఇన్నోవేషన్’ సెషన్‌లో భాగంగా చుక్‌రాబిన్స్‌తో సమావేశమయ్యాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సిస్కో భాగస్వామి కావడంపై ఇరువురం చర్చించాం’’ అని తెలిపారు
హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్‌తో ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) భేటీ అయ్యారు. సమర్థమైన పవర్ ట్రాన్స్ మిషన్ కోసం రాష్ట్రంలో హెచ్‌వీడీసీ తరహా అధునాతన సాంకేతికతను అమలు చేసేందుకు సహకరించాలని కోరారు.ష్ట్రంలో 3 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ల (కడప, అనంతపురం, తాడేపల్లిగూడెం) ఏర్పాటుకు సంబంధించి గత ప్రణాళికలను మళ్లీ పరిశీలించి వాటిని గ్రౌండింగ్ చేసే కార్యక్రమాలను వేగవంతం చేయాలని భరత్ కౌశల్‌కు విజ్ఞప్తి చేశాను. కంపెనీ సహచరులతో చర్చించి ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ ద్వారా పబ్లిక్ సర్వీస్ డెలివరీని మెరుగుపరిచే సిస్టమ్‌లను హిటాచీ అభివృద్ధి చేస్తోందని భరత్ కౌశల్ వివరించారు’’ అని లోకేశ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌ను హెల్త్‌కేర్ టెక్నాలజీ హబ్‌గా మార్చేందుకు సహకారం అందించాలని డబ్ల్యూఈఎఫ్ హెల్త్‌కేర్ హెడ్ శ్యామ్ బిషన్‌ను మంత్రి నారా లోకేశ్ కోరారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను సాధించేందుకు రాష్ట్రానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచస్థాయి ఆరోగ్య ప్రమాణాలకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు చేపట్టేందుకు మద్దతునివ్వాలని కోరారు.
వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ ఛైర్మన్ జాన్ డ్రూతో లోకేశ్ సమావేశమయ్యారు. ఏపీలో ట్రేడ్ హబ్ ఏర్పాటు చేయాలని.. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు నెలకొల్పాలని కోరారు. చిన్న తరహా పరిశ్రమలకు గ్లోబల్ మార్కెట్ యాక్సెస్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.