డిప్యూటీ సీఎం అంశం ఏపీ రాజకీయల్లో పెను ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈ అంశంపై దృష్టి సారించిన టీడీపీ హైకమాండ్ వివాదానికి ముగింపు పలికే విధంగా చర్యలు తీసుకుంది. ఈ అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇదే అంశంపై జనసేన కేంద్ర కార్యాలయం కూడా స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై జనసేన నేతలు, కార్యకర్తలు బహిరంగంగా మాట్లాడొద్దని, సోషల్ మీడియాలో స్పందించవద్దని ఆదేశాలు జారీ చేసింది.
కాగా నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ కొందరు టీడీపీ నేతలు చేసిన డిమాండ్ చర్చనీయాంశంగా మారింది. ఈ డిమాండ్ లేవనెత్తుతున్న టీడీపీ నేతల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో జనసేన నేతలు కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యారు. లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు కోరుకోవడంలో తప్పు లేదని... తమకు కూడా పవన్ ను సీఎంగా చూడాలని ఉందని వారు కౌంటర్ అటాక్ ఇచ్చారు.
No One Should Speak Publicly on Deputy CM Issue: Janasena
డిప్యూటీ సీఎం అంశంపై జనసేన కీలక ఆదేశాలు. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించొద్దు - జనసేన కేంద్ర కార్యాలయం@PawanKalyan @JanaSenaParty @naralokesh #AndhraPradesh #deputycm #Pawankalyan #NaraLokesh #RTV pic.twitter.com/xZ4VdSiGF6
— RTV (@RTVnewsnetwork) January 21, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)