Indian Corona Variant: భారత్‌లో కేసులు, మరణాల పెరుగుదలకు ఈ వైరస్సే కారణం 44 దేశాలను వణికిస్తున్న భారత్ బీ.1.617 వేరియంట్‌, వేగంగా వ్యాప్తిస్తూ ప్రమాదకరంగా మారిన కొత్త రకం కరోనా

దేశంలో గత ఏడాది అక్టోబరులో గుర్తించిన కరోనా వేరియంట్ 44 దేశాల ఓపెన్ యాక్సెస్ డేటాబేస్‌లో అప్‌లోడ్ చేసిన 4,500కు పైగా శాంపిల్‌లో గుర్తించామని పేర్కొంది.

World Health Organization (File Photo)

Mumbai, May 12: భారత్‌లో మొదటిసారిగా గుర్తించిన కొవిడ్‌-19 బీ.1.617 వేరియంట్‌ను (Indian Corona Variant) ప్రపంచవ్యాప్తంగా 44 దేశాల్లో గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దేశంలో గత ఏడాది అక్టోబరులో గుర్తించిన కరోనా వేరియంట్ 44 దేశాల ఓపెన్ యాక్సెస్ డేటాబేస్‌లో అప్‌లోడ్ చేసిన 4,500కు పైగా శాంపిల్‌లో గుర్తించామని పేర్కొంది. ఈ రకం వైరస్‌ కారణంగానే బ్రిటన్‌లో భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ బీ.1.617 వేరియంట్ (COVID-19 Variant B.1.617) ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వారంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

కొత్త రకం వేరియంట్ బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో మొదట గుర్తించారు. కరోనా వైరస్ కొత్త రకం వేరియంట్ (ndian COVID-19 Variant) ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని, ఇది ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అసలు వైరస్ కంటే ఈ వైరస్ తేలికగా వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పింది. భారత్‌లో కేసులు, మరణాల పెరుగుదలకు ఈ వేరియంట్‌ సైతం కారణమని వివరించింది.

దేశంలో తాజాగా 3,48,421 మందికి కరోనా, గ‌త 24 గంట‌ల్లో 4205 మరణాలు, దేశంలో 37,04,099 యాక్టివ్‌ కేసులు, కొత్త‌గా 3,55,338 మంది డిశ్చార్జ్

కరోనా వైరస్ కొత్త రకం వేరియంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని, దీనివల్ల ఇది ప్రమాదకరమని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. అసలు వైరస్ కంటే ఈ వైరస్ తేలికగా వ్యాప్తిచెందుతుందని డబ్ల్యూహెచ్‌ఓ వివరించింది. ప్రపంచంలోనే 1.3 బిలియన్ల జనాభా ఉన్న భారత్ కరోనా వ్యాప్తిలో మొదటి స్థానంలో, అమెరికా రెండవ స్థానంలో ఉందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.