Covid-19 Deaths in Italy: ఇటలీలో కరోనా చావు కేకలు, ఒక్క రోజే 1000 మంది మృతి, 9134కు చేరిన మృతుల సంఖ్య, 86 వేల మందికి కోవిడ్-19 పాజిటివ్

కోవిడ్ 19 ధాటికి ఆ దేశం చిగురటాకులా వణికిపోతోంది. దీని దెబ్బకు శుక్రవారం ఒక్కరోజే దాదాపు 1000 కరోనా మరణాలు (COVID-19 Deaths in Italy) నమోదయ్యాయి. కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 9134కు చేరింది. అదే విధంగా దాదాపు 86 వేల మంది కరోనా పేషెంట్లుగా మారారు.

Coronavirus Outbreak in Italy. (Photo Credits: AFP)

Rome Mar 28: యూరప్‌ దేశం ఇటలీపై కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. కోవిడ్ 19 ధాటికి ఆ దేశం చిగురటాకులా వణికిపోతోంది. దీని దెబ్బకు శుక్రవారం ఒక్కరోజే దాదాపు 1000 కరోనా మరణాలు (COVID-19 Deaths in Italy) నమోదయ్యాయి. కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 9134కు చేరింది. అదే విధంగా దాదాపు 86 వేల మంది కరోనా పేషెంట్లుగా మారారు.

ఇండియాలో 78 మంది రికవరీ, 873కి చేరిన కరోనా కేసులు

విషాదకర అంశం ఏంటంటే చైనాలోని మరణాల కంటే ఇటలీలో (Italy) సంభవించిన మరణాలు దాదాపు మూడు రెట్లు అధికంగా ఉన్నాయి. కేవలం వారాల వ్యవధిలోనే వేలాది మంది కరోనా వైరస్‌ కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే గత వారంతో పోలిస్తే శుక్రవారం నాటికి కరోనా మరణాల సంఖ్యలో తగ్గుదల నమోదైందని... సగటు మరణాల శాతం 8 నుంచి 7.4 శాతానికి పడిపోయిందని జాతీయ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

అమెరికా అల్లకల్లోలం, లక్ష దాటిన కరోనా కేసులు

ఈ విషయం తమలో ఆశావహ దృక్పథాన్ని పెంపొందిస్తోందని.. అయితే కరోనాపై మరింత కఠినంగా పోరాడాల్సి ఉందని ఆ సంస్థ చీఫ్‌ సిల్వియో బ్రుసాఫెరో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్న నేపథ్యంలో సత్ఫలితాలు పొందగలుగుతున్నామన్నారు.

మెథనాల్‌ తాగి 400 మంది మృతి

కాగా ఇటలీలో మార్చి 9 నుంచి లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనా రోజురోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ గడువు(ఏప్రిల్‌ 3)ను మరికొన్ని రోజుల పాటు పొడగించే అవకాశం ఉందని ఇటలీ ప్రధాని గుసిప్పీ కోంటే గత వారం ప్రకటన విడుదల చేశారు.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు సోకిన కరోనావైరస్

విపత్కర పరిస్థితుల్లో ఇటలీకి ఫ్రాన్స్‌ అండగా నిలుస్తుందని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ భరోసా ఇచ్చారు. ఓ ఇటలీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ చైనా, రష్యాల సహాయం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇటలీకి ఫ్రాన్స్‌, జర్మనీ కూడా సహాయం చేస్తున్నాయి. రెండు మిలియన్ల మాస్కులు, వందల కొద్దీ గౌన్లు(వైద్య సిబ్బందికి) అక్కడికి పంపించాం. అయితే ఇది ఏమాత్రం సరిపోదు.

ఇటలీలో పిట్టల్లా రాలిపోతున్న జనం

ఇది కేవలం ఆరంభం మాత్రమే. మేం వారికి మరింత సాయం చేస్తాం. ఈ కష్టం కేవలం ఇటలీ, స్పెయిన్‌కో పరిమితం కాదు. ప్రతీ ఒక్కరికి ఎదురవుతుంది. అందుకే యూరోప్‌ కలిసికట్టుగా ఉండాలి. స్వార్థంగా ఉండకండి. స్వార్థపూరితమైన.. ఐకమత్యంగా లేని యూరప్‌ను నేను కోరుకోవడం లేదు’’ అని పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు

Union Budget 2025-26: వేత‌న‌జీవుల‌కు త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్, రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ట్యాక్స్ మిన‌హాయింపు ఇచ్చే యోచ‌న‌లో కేంద్రం, ఈ బడ్జెట్ లో బొనాంజా ప్ర‌కటించే ఛాన్స్

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.