Donald Trump: కరోనా వచ్చినా మాస్క్ లేకుండా ఫోటోలకు ఫోజు ఇచ్చిన ట్రంప్, మిలటరీ ఆస్పత్రి నుండి డిశ్చార్జ్, తీవ్రస్థాయిలో వెలువెత్తుతున్న విమర్శలు, అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న బైడెన్
కరోనా వైరస్ బారిన పడి మిలటరీ ఆస్పత్రిలో చేరిన ఆయన సోమవారం శ్వేతసౌధానికి తిరిగి వచ్చారు. వాల్టర్ రీడ్ మెడికల్ హాస్పిటల్ నుంచి (Discharged From Hospital) ప్రత్యేక హెలికాప్టర్‌లో వైట్‌హౌజ్‌కు చేరుకున్న ట్రంప్... ఎగ్జిక్యూటివ్ మాన్షన్‌లో రిపోర్టకు అభివాదం చేస్తూ... థమ్సప్ సింబల్ చూపుతూ తాను బాగానే ఉన్నానన్న సంకేతాలు ఇచ్చారు.
Washington, October 6: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వైరస్ బారిన పడి మిలటరీ ఆస్పత్రిలో చేరిన ఆయన సోమవారం శ్వేతసౌధానికి తిరిగి వచ్చారు. వాల్టర్ రీడ్ మెడికల్ హాస్పిటల్ నుంచి (Discharged From Hospital) ప్రత్యేక హెలికాప్టర్‌లో వైట్‌హౌజ్‌కు చేరుకున్న ట్రంప్... ఎగ్జిక్యూటివ్ మాన్షన్‌లో రిపోర్టకు అభివాదం చేస్తూ... థమ్సప్ సింబల్ చూపుతూ తాను బాగానే ఉన్నానన్న సంకేతాలు ఇచ్చారు.
మిలటరీ ఆసుపత్రి నుంచి వాషింగ్టన్ లోని వైట్ హౌస్ (White House) తిరిగివచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మాస్కు తొలగించి ఫొటోలకు ఫోజు ఇచ్చారు. అలాగే డిశ్చార్జ్ కావడానికి ముందు అకస్మాత్తుగా ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన ట్రంప్.. కారులో కలియదిరిగారు. తన అభిమానులకు అభివాదం చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. వైట్ హౌస్ కు తిరిగివచ్చాక బ్లూ రూమ్ వెలుపల బాల్కనీలో మాస్కు లేకుండా నిలబడ్డారు. వైట్ హౌస్ దక్షిణ పోర్టికో మెట్లపైకి నడిచి వచ్చిన ట్రంప్ మాస్కు తీసివేసి ఫొటోలకు ఫోజులిచ్చారు. బొటనవేళ్లు పైకి చూపిస్తూ వందనం చేశారు.మెరైన్ వన్ హెలికాప్టర్‌లో వైట్‌హౌస్‌కు వచ్చిన ట్రంప్ నాటకీయంగా మాస్కు తొలగించి ఫొటోలకు ఫోజులివ్వడంపై విమర్శలు తలెత్తాయి.
Trump says 'Don't be afraid of COVID-19, Don't let it dominate your life; Watch Video:
ట్రంప్‌కు చికిత్స అందించిన ఆస్పత్రి డాక్టర్‌తో పాటు, ప్రతిపక్ష డెమొక్రాట్లు అధ్యక్షుడి తీరును ఆక్షేపించారు. అయితే తన కోసం ప్రార్థిస్తున్న అభిమానుల్లో ఉత్తేజం నింపేందుకే తాను ఇలా బయటకు వచ్చినట్లు ట్రంప్ పేర్కొనడం గమనార్హం. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు డిశ్చార్జ్ అయ్యాను. చాలా ఆరోగ్యంగా ఉన్నాను. కరోనా గురించి భయపడొద్దు. మీ జీవితంపై ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం కరోనాకు ఇవ్వొద్దు’’ అని ట్రంప్ ట్వీట్ చేశారు.
అంతేకాకుండా 20 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడే తాను ఎంతో ఆరోగ్యవంతంగా ఉన్నట్టు ట్రంప్ తెలిపారు. నవంబరు 3వతేదీన అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్ జో బిడెన్ పై ట్రంప్ పోటీ చేస్తున్నారు. గురువారం సాయంత్రం ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌ను మెరుగైన వైద్యం కోసం మిలటరీ ఆస్పత్రికి తరలించగా.. సోమవారం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం మరింత మెరుగుపడిందని, తదుపరి చికిత్స వైట్‌హౌజ్‌లో కొనసాగించవచ్చని డాక్లర్లు చెప్పారని శ్వేతసౌధ వర్గాలు వెల్లడించాయి.
తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ అనంతరం ట్రంప్‌తో పోలిస్తే ప్రత్యర్థి, డెమొక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ పాపులారిటీ బాగానే పెరిగిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. అధ్యక్ష రేసులో దిగిన అనంతరం తొలిసారి ఆధిక్యం దిశగా సాగిన బైడెన్, ట్రంప్ కంటే 14 పర్సంటేజ్ పాయింట్లు సాధించినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రెసిడెంట్ పదవి దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న ట్రంప్.. నవంబరు 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించడమే లక్ష్యంగా, అనారోగ్యాన్ని పక్కనబెట్టి మరీ ప్రచారాన్ని ఉధృతం చేయాలని భావిస్తున్నారు.