Mali Gold Mine Collapse: కుప్ప‌కూలిన బంగారు గ‌ని, 70 మంది కార్మికులు స‌జీవ స‌మాధి, మృతుల్లో ఎక్కువ మంది మైన‌ర్లే

నైరుతి కౌలికోరో ప్రాంతంలోని కంగబా జిల్లాలో గోల్డ్ మైన్ (Mali Gold Mine Collapse) కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 73మందికిపైగా మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది మైనర్లు ఉన్నారు. మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

Representational image (Photo Credit- Pixabay)

Mali, JAN 25: మాలిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నైరుతి కౌలికోరో ప్రాంతంలోని కంగబా జిల్లాలో గోల్డ్ మైన్ (Mali Gold Mine Collapse) కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 73మందికిపైగా మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది మైనర్లు ఉన్నారు. మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. బంగారు గని కుప్పకూలిన (Mali Gold Mine Collapse) సమయంలో అందులో 150 నుంచి 100 మంది వరకు ఉన్నట్లు మాలి చాంబర్ ఆఫ్ మైన్స్ అధ్యక్షుడు అబ్దులయే పోనా వెల్లడించారు.

China Fire: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం, 39 మంది మంటల్లో సజీవ దహనం, మరో 9 మందికి తీవ్ర గాయాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా ఎగసిన మంటలు 

గని వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆఫ్రియాలోని మూడో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారు అయిన మాలిలో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణం.

 

అయితే.. ఈసారి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. తాజా ఘటనపై గనుల మంత్రిత్వ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మైనింగ్ సైట్ ల సమీపంలో నివసించే మైనర్లు, కమ్యూనిటీలు భద్రతా అవసరాలకు అనుగుణంగా ఉండాలని కోరింది. గని కూలిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Canada Plane Crash: కెన‌డాలో కుప్ప‌కూలిన‌ విమానం, టేకాఫ్ అయిన క్ష‌ణాల్లోనే తెగిపోయిన సంబంధాలు, ఆరుగురు కార్మికులు మృతి 

ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటిగా ఉన్న మాలి, ఆఫ్రికాలో బంగారు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. మాలి 2022లో 72.2 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది. ఈ లోహం జాతీయ బడ్జెట్ లో 25శాతం, ఎగుమతి ఆదాయాల్లో 75శాతం. 2023లో దాని జీడీపీలో 10శాతం దోహదపడిందని గతేడాది మార్చిలో అప్పటి గనుల శాఖ మంత్రి లామైన్ సేదౌ ట్రారే చెప్పారు. ఈ దేశంలో 10శాతం కంటే ఎక్కువ మంది తమ ఆదాయంకోసం మైనింగ్ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.