Canada Plane Crash: కెన‌డాలో కుప్ప‌కూలిన‌ విమానం, టేకాఫ్ అయిన క్ష‌ణాల్లోనే తెగిపోయిన సంబంధాలు, ఆరుగురు కార్మికులు మృతి
Flight (Representative image)

Canada, JAN 24: కెన‌డాలో విమానం కూలిన(Plane Crash) ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతిచెందారు. చిన్న‌పాటి కంలో ఆ విమానం కూలింది. ఈ ఘ‌ట‌న వాయ‌వ్య కెన‌డా ప‌ర్వ‌త ప్రాంతాల్లో చోటుచేసుకున్న‌ది. ప్ర‌మాదంలో ఒక వ్య‌క్తి ప్రాణాల‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అత‌ని ప‌రిస్థితి గురించి వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించ‌లేదు. ఫోర్ట్ స్మిత్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొన్ని క్ష‌ణాల‌కే ఆ విమానం నుంచి సంబంధాలు తెగిపోయిన‌ట్లు ఒంటారియోలోని రెస్క్యూ సెంట‌ర్ తెలిపింది.

 

నార్త్‌వెస్ట్ర‌న్ ఎయిర్ కంపెనీకి చెందిన ట్విన్ ట‌ర్బో (Twin turbo) విమానం ప్ర‌మాదానికి గురైంది. ర‌న్‌వే నుంచి కిలోమీట‌ర్ వెళ్లిన త‌ర్వాత ఆ విమానం కూలిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఫోర్ట్ స్మిత్ నుంచి బయ‌లుదేరాల్సిన విమానాల‌ను ర‌ద్దు చేశారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కెన‌డా ట్రాన్స్‌పోర్టు విభాగం దర్యాప్తు ప్రారంభించింది.