US Mass Shooting Incident: కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. నిందితుడు సహా 9 మంది దుర్మరణం.. కనిపించిన వారిపై తుపాకీతో కాల్పుల జరిపిన నిందితుడు.. పోలీసుల ఎదురు కాల్పుల్లో హతం

కాల్పులతో అగ్రరాజ్యం మరోసారి కలకలం రేగింది. టెక్సాస్ రాష్ట్రంలో ఆలెన్ నగరంలోని ఓ షాపింగ్ మాల్‌ సమీపంలో శనివారం ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది అమాయకులు మరణించగా మరో ఏడుగురు గాయాలపాలయ్యారు.

US Shooting (Credits: Twitter)

Newyork, May 7: అమెరికాలో (America) తుపాకీ సంస్కృతి వెర్రితలలకు పోతున్నది. కాల్పులతో అగ్రరాజ్యం మరోసారి కలకలం రేగింది. టెక్సాస్ (Texas) రాష్ట్రంలో ఆలెన్ నగరంలోని ఓ షాపింగ్ మాల్‌ (Shopping Mall) సమీపంలో శనివారం ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది అమాయకులు మరణించగా మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. దీంతో ఆగంతకుడు మరింతగా రెచ్చిపోతుండగా అప్పటికే అక్కడ ఉన్న ఓ పోలీసు అధికారి నిందితుడిపై ఎదురు కాల్పులు జరిపారు. దీంతో నిందితుడు అక్కడికక్కడే హతమయ్యాడు. నిందితుడు ఫుట్‌పాత్‌పై నడుస్తూ కనిపించిన వారిపై కాల్పులకు తెగబడ్డట్టు ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. గాయపడ్డవారిలో చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం.

Hyderabad Horror: హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య.. పోలీసుల కేసు నమోదు.. దర్యాప్తు.. వీడియోతో..

ఐదు నెలల్లో 198 కాల్పుల ఘటనలు

అమెరికాలో ఈ ఏడాది ఇప్పటివరకూ 198 కాల్పుల ఘటనలు వెలుగు చూశాయి. 2016 తరువాత ఇదే అత్యధికమని పరిశీలకులు చెబుతున్నారు. 2021లో అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనల్లో సుమారు 49 వేల మంది మరణించగా 2020లో 45 వేల మంది మరణించారు.

SSC Students Suicides: ఏపీలో ‘పది’ పరీక్షల ఫలితాలతో మనస్తాపం.. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఉరివేసుకుని ఇద్దరు అమ్మాయిల ఆత్మహత్య.. మరో ఇద్దరి ఆత్మహత్యాయత్నం