Nithyananda: అగ్రరాజ్యం అమెరికాకు నిత్యానంద షాక్.. 30 నగరాల్లో ఫోర్జరీ చర్యలు.. ‘సిస్టర్ సిటీ’ పేరిట ఒప్పందాలు.. వీడియోతో

ఆ తరువాత దక్షిణ అమెరికా దీవుల్లో తిష్టవేసి ఆ ప్రాంతాన్ని కైలాస దేశంగా స్వయం ప్రకటన చేసుకున్నాడు. తాజాగా నిత్యానంద అమెరికాలోని 30 నగరాల్లో ఫోర్జరీకి పాల్పడ్డాడని సమాచారం.

Nithyananda (Credits: Twitter)

Newyork, March 18: లైంగిక వేధింపులు (Sexual Harassment), కిడ్నాప్ (Kidnap) కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ వివాదాస్పద గురు నిత్యానంద (Nithyananda) భారత్ (India) నుంచి పరారైన విషయం విధితమే. ఆ తరువాత దక్షిణ అమెరికా దీవుల్లో తిష్టవేసి ఆ ప్రాంతాన్ని కైలాస దేశంగా స్వయం ప్రకటన చేసుకున్నాడు. తాజాగా నిత్యానంద అమెరికాలోని 30 నగరాల్లో ఫోర్జరీకి పాల్పడ్డాడని సమాచారం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశంగా స్వయం ప్రకటన చేసుకున్న నిత్యానంద అమెరికాలోని 30 నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యం ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు ఫాక్స్ న్యూస్ తన నివేదికలో పేర్కొంది. ఈనెల 12న కైలాస దేశంతో ‘సోదరి – నగరం’ ఒప్పందాలను చేసుకున్నట్లు నెవార్క్ నగరం ప్రకటించిన విషయం విధితమే. ఈ నగరంతో పాటు రిచ్‌మండ్, వర్జీనియా, డేటన్, ఒహోయో, బ్యూనా పార్క్, ఫ్లోరిడా వంటి 30 నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యాలను కుదుర్చుకున్నట్లు కైలాస దేశం వెబ్ సైట్‌లో పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన.. ఏపీలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం.. తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ద్రోణి

ఐక్యరాజ్య సమితి గుర్తింపులేని దేశం, కనీసం ఉనికిలో లేని, నకిలీ దేశంగా భావిస్తున్న కైలాస దేశంతో అమెరికాలోని ఆయా నగరాలు ఒప్పందాలు చేసుకోవటం చర్చనీయంశంగా మారింది. కాగా, రెండో ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా అధ్యక్షుడైన డ్వైట్ డేవిడ్ ఐసెన్ హోవర్ .. ‘సిస్టర్ సిటీస్ ఇంటర్నేషనల్ (ఎస్ఐసీ) రూపంలో ఒప్పందాలను తెరపైకి తెచ్చారు. ఈ ఒప్పందం ద్వారా నగరాల మధ్య విద్య, సాంస్కృతిక, వ్యాపార బంధాలను బలపరుస్తుంది. అమెరికాకు చెందిన ఈ సిస్టర్ సిటీ ఒప్పందాన్ని భారత్ నుంచి పరారైన నిత్యానంద కూడా ఉపయోగించుకున్నాడు. ఇక, ఇటీవల ఐక్యరాజ్య సమితిలో కైలాస దేశం తరపున ప్రతినిధులు పాల్గొని భారత్‌కు వ్యతిరేకంగా ప్రసంగించారు. అయితే, ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు మాత్రం కైలాస దేశంకు ఐక్యరాజ్యసమితి గుర్తింపు లేదని, వారి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోమని తేల్చిచెప్పారు. తాజాగా మరోసారి నిత్యానంద కైలాస దేశం వార్తల్లో నిలిచింది.

పెళ్లి ఇంట్లో చావుమేళం, రాత్రి కూతురు పెళ్లి ఉండగా ఉదయమే చనిపోయిన తండ్రి, ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif