Japan Rocket Explode: ఇటు చంద్రయాన్ సక్సెస్.. అటు పేలిపోయిన రాకెట్ .. జపాన్ లో పరీక్ష దశలోనే పేలిపోయిన రాకెట్ ఇంజిన్ (వీడియోతో)
జపాన్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేస్తున్న ఎప్సిలాన్ రాకెట్ ఇంజిన్ పరీక్షల సమయంలోనే పేలిపోయింది.
Tokyo, July 15: చంద్రయాన్ (Chandrayaan-3) సక్సెస్ తో ఒకవైపు ఇండియన్స్ (Indians) సంబురాలు చేసుకొంటుంటే ప్రపంచంలో అతి భారీ అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాల్లో ఒకటైన జపాన్‌కు (Japan) షాక్ తగిలింది. జపాన్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేస్తున్న ఎప్సిలాన్ రాకెట్ ఇంజిన్ (Rocket Engine) పరీక్షల సమయంలోనే పేలిపోయింది. ఖ్యుషు దీవిలో యుచినోరా స్పేస్ సెంటర్ నుంచి నిన్న ఉదయం 9.50 నిమిషాలకు రాకెట్ ఇంజిన్‌ను పరీక్షిస్తుండగా పేలిపోయింది. ఈ పేలుడు గురించి ఉదయం 9.57 గంటలకు జపాన్ స్పేస్ ఏజెన్సీ ప్రకటన చేసింది. రాకెట్‌ను పరీక్షిస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఏమైనా జరిగిందా అనే విషయంలో ఇప్పటివరకు సమాచారం లేదని జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీ అధికారులు తెలిపారు.
ఏడాది కింద ఓసారి..
2022 అక్టోబర్‌లో ఘన ఇంధనం ఆధారంగా పనిచేసే ఎప్సిలాన్ రాకెట్‌ను జపాన్ ప్రయోగించింది. అప్పట్లో ఆ ప్రయోగం విఫలమైంది. తాజా మార్పులతో పరీక్షించగా ప్రయోగం మొదలైన 50 సెకన్లలోనే రాకెట్ పేలిపోయింది.