Russia-Ukraine War: ఉక్రెయిన్ యుద్దం ఓ తీవ్ర విషాదం, పుతిన్ నోటి వెంట సంచలన వ్యాఖ్యలు, యుద్ధం కోసం ఉక్రెయిన్‌కు భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించిన అమెరికా

ఉక్రెయిన్‌లో సంఘర్షణను "భాగస్వామ్య విషాదం"గా అభివర్ణించారు, అయితే ఉక్రెయిన్, దాని మిత్రదేశాలపై శత్రుత్వం చెలరేగడానికి నిందలు వేశారు.

Russian President Vladimir Putin | (Photo credit: kremlin.ru)

Moscow, Dec 22: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఉక్రెయిన్‌ యుద్ధంపై (Russia-Ukraine War) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో సంఘర్షణను "భాగస్వామ్య విషాదం"గా అభివర్ణించారు, అయితే ఉక్రెయిన్, దాని మిత్రదేశాలపై శత్రుత్వం చెలరేగడానికి నిందలు వేశారు. ఏమి జరుగుతోంది, వాస్తవానికి, ఈ యుద్ధం ఒక విషాదం. ఇది మా విధానం యొక్క ఫలితం కాదు. ఇది మూడవ దేశాల విధానం యొక్క ఫలితం" అని సీనియర్ మిలిటరీతో టెలివిజన్ సమావేశంలో రష్యా నాయకుడు (Vladimir Putin) అన్నారు.

ఉక్రెయిన్‌ ప్రజలను మేమెప్పుడూ మా సోదరులుగానే చూశాం. ఇప్పటికీ అలాగే చూస్తున్నాం. ఇప్పుడక్కడ జరుగుతున్నది కచ్చితంగా విషాదమే (Ukraine Conflict "Shared Tragedy) అని అంగీకరించారు. ఏకపక్షంగా కయ్యానికి కాలు దువ్వి 9 నెలలుగా ప్రపంచమంతటినీ అతలాకుతలం చేస్తున్న ఆయన బుధవారం అత్యున్నత సైనికాధికారులతో భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ యుద్ధానికి కారణం పశ్చిమ దేశాలే తప్ప తాము కాదని (But Not Russia's Fault) ఈ ఇంటర్యూలో చెప్పుకొచ్చారు.

ఉగ్రవాదం గురించి ముందు మీ దేశ మంత్రులను అడగండి, ద‌క్షిణాసియాలో ఇంకెన్నాళ్లు ఈ ఉగ్ర‌వాదం అన్న పాక్ జర్నలిస్టు ప్రశ్నకు విదేశాంగ‌ మంత్రి జైశంక‌ర్‌ కౌంటర్

లక్ష్యాలు సాధించేదాకా ముందుకే వెళ్లి తీరతామని పునరుద్ఘాటించారు. మరోవైపు రష్యా సైన్యం సంఖ్యను ఇప్పుడున్న 10 లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతామని రక్షణ మంత్రి సెర్గీ షొయిగూ ప్రకటించారు. వీరిలో దాదాపు 7 లక్షల మంది స్వచ్ఛంద, కాంట్రాక్టు సైనికులుంటారన్నారు. ఫిన్లండ్, స్వీడన్‌లకు చెక్‌ పెట్టేందుకు పశ్చిమ రష్యాలో నూతన సైనిక విభాగాలను నెలకొల్పుతామని షొయిగూ ప్రకటించారు.

ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌కు అమెరికా మరో భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించింది. 180 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయం అందజేస్తామని హమీ ఇచ్చింది.

ఇందులో ఒక బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలు, 800 మిలియన్‌ డాలర్ల నిధులున్నాయి. పేట్రియాట్‌ క్షిపణులు, ఉక్రెయిన్‌ యుద్ధ విమానాల కోసం అత్యంత కచ్చితత్వంతో కూడిన గైడెడ్‌ బాంబులను తొలిసారిగా ఉక్రెయిన్‌కు ఇవ్వనుంది. కాగా ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులు ముమ్మరం చేస్తోంది. డ్రోన్లు ప్రయోగిస్తోంది. వాటిని తిప్పికొట్టడానికే కొత్త ఆయుధాలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉత్తర కొరియాలో దారుణం, పక్కదేశం సినిమాలు చూశారని ఇద్దరి విద్యార్థులను ప్రజల మధ్యనే కాల్చి చంపిన కిమ్‌ జోంగ్‌ ఉన్ ప్రభుత్వం

రష్యా తమపై దండయాత్ర చేపట్టిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. అమెరికా కాంగ్రెస్‌లో ఆయన ప్రసంగించారు. అగ్రరాజ్యం తమ దేశానికి అందిస్తున్న భారీ సాయానికి కృతజ్ఞతలు చెప్పారు. అలాగే ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తుంది సాయం కాదని, ప్రాజాస్వామ్యం, అంతర్జాతీయ భద్రతకు అగ్రరాజ్యం పెడుతున్న పెట్టుబడి అని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. 2023లోనూ తమకు సాయాన్ని కొనసాగించారని కోరారు.

అగ్రరాజ్యం ఇప్పటికే ఉక్రెయిన్‌కు 50 బిలియన్ డాలర్లకుపైగా సాయం అందించింది. త్వరలో పేట్రియట్ మిసైల్స్ కూడా పంపిస్తామని హామీ ఇచ్చింది.కాంగ్రెస్‌లో ప్రసంగించడానికి ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో శ్వేతసౌధంలో భేటీ అయ్యారు జెలెన్‌స్కీ. ఇద్దరూ కలిసి ఓవల్ ఆఫీస్‌లో కన్పించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.