దక్షిణాసియాలో ఇంకెన్నాళ్లు ఈ ఉగ్రవాదం ఉంటుందని పాకిస్థాన్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జర్నలిస్టు వేసిన ప్రశ్నకు మంత్రి జైశంకర్ బదులిస్తూ.. పాకిస్థాన్‌లోని మీ మంత్రిని ఈ ప్రశ్న వేయాలన్నారు. సరైన వ్యక్తిని ఈ ప్రశ్న వేయడం లేదని, ఎందుకంటే పాకిస్థాన్ మంత్రులకు ఈ విషయం తెలుసు అని, ఉగ్రవాదాన్ని పాక్ పెంచిపోషిస్తోందని ఆయన అన్నారు.
ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా పాకిస్థాన్‌ను ప్రపంచ దేశాలు చూస్తున్నాయన్నారు. ఉగ్రవాదం ఎక్కడ పుట్టిందో అంతర్జాతీయ సమాజానికి తెలుసు అని మంత్రి బదులిచ్చారు. యూఎన్ సెక్యూర్టీ కౌన్సిల్‌లో రిపోర్టర్లతో మాట్లాడుతూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
Here's Video
#WATCH |...They're ministers in Pakistan who can tell how long Pakistan intends to practice terrorism. World isn't stupid, it increasingly calls out countries, orgs indulging in terrorism...my advice is to clean up your act & try to be good neighbour:EAM S Jaishankar at New York pic.twitter.com/BJYmNcb2Oj
— ANI (@ANI) December 15, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)