Afghanistan Crisis: బయటకొస్తున్న తాలిబన్ల అసలు రూపం, భారత్‌తో సహా పలు దేశాల పౌరులు కిడ్నాప్, కాబూల్‌లోని ఖ‌ర్జాయ్ విమానాశ్ర‌యం వ‌ద్ద కిడ్నాప్ కలకలం, 150 మంది కిడ్నాప్ వార్తల‌ను ఖండించిన తాలిబ‌న్ ప్ర‌తినిధి

తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. ఇప్పటికే భారత దౌత్య కార్యాలయాల్లో సోదాలు జరిపిన తాలిబన్లు..కీలక డాక్యుమెంట్లు, కార్లను తమ వెంట పట్టుకెళ్లడం తెలిసిందే. తాజాగా తాలిబన్లు మరో పైశాచికత్వానికి పాల్పడ్డారు.

Taliban (representational Image/ Photo Credit: PTI)

Kabul, August 21: అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. ఇప్పటికే భారత దౌత్య కార్యాలయాల్లో సోదాలు జరిపిన తాలిబన్లు..కీలక డాక్యుమెంట్లు, కార్లను తమ వెంట పట్టుకెళ్లడం తెలిసిందే. తాజాగా తాలిబన్లు మరో పైశాచికత్వానికి పాల్పడ్డారు. ఆఫ్ఘ‌నిస్తాన్ రాజ‌ధాని కాబూల్‌లోని ఖ‌ర్జాయ్ విమానాశ్ర‌యం వ‌ద్ద సుమారు 150 మందిని తాలిబ‌న్లు బంధించిన‌ట్లు తెలుస్తోంది. దాంట్లో చాలా వ‌ర‌కు ఇండియ‌న్లే ( Indians Captured ) ఉన్నార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా వెల్ల‌డైంది.

గ‌త ఆదివారం కాబూల్‌ను తాలిబ‌న్లు హ‌స్త‌గ‌తం చేసుకున్న త‌ర్వాత‌.. ఆ దేశం నుంచి పారిపోయేందుకు పౌరులు విమానాశ్ర‌యానికి బారులు తీరుతున్నారు. ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద హృద‌య‌విదార‌క‌ర దృశ్యాలు క‌నిపిస్తున్నాయి. పిల్ల‌ల‌తో ఇనుప కంచెల‌ను దాటేందుకు ప్ర‌య‌త్నిస్తున్న దృశ్యాలు అంద‌ర్నీ క‌ల‌చివేస్తున్న విష‌యం తెలిసిందే. కొంద‌రైతే కంచె అవ‌త‌ల ఉన్న సైనికుల చేతుల్లోకి త‌మ పిల్ల‌ల్ని వ‌దిలేస్తున్నారు. తాము ప్రాణాలు ద‌క్కించుకోకున్నా.. క‌నీసం త‌మ పిల్ల‌ల్ని అయినా సుర‌క్షిత ప్రాంతాల‌కు తీసుకువెళ్లాల‌ని వేడుకుంటున్నారు.

దొంగను కాదు, కట్టుబట్టలతో దేశం విడిచి వెళ్లాను, మళ్లీ అఫ్ఘనిస్తాన్ తిరిగొస్తాను' వీడియో ప్రకటన విడుదల చేసిన అష్రఫ్ ఘనీ; అఫ్గాన్‌లో ఉగ్రవాదం లేని ప్రభుత్వ స్థాపనే లక్ష్యం అంటున్న యూఎస్- ఇండియా

తాజాగా కిడ్నాపింగ్ వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ విషయాన్ని కాబుల్‌లోని భారత ఎంబసీకి చెందిన ఓ అఫ్గన్ ఉద్యోగి వెల్లడించారు.ఇదిలా ఉంటే తాలిబన్ల చెరలో ఉన్న భారతీయులకు తక్షణ ప్రమాదం ఏం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. భారతీయులను తాలిబన్లు కిడ్నాప్ (Including Indian Citizens) చేసినట్లు ది న్యూయార్క్‌ టైమ్స్‌కు చెందిన రిపోర్టర్‌ ఒకరు ట్వీట్‌ చేశారు. సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్‌ చేసిన భారతీయులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

అబ్దుల్ అలీ మజారీ విగ్రహం ధ్వంసం, అఫ్గాన్‌ తొలి మహిళా గవర్నర్‌ సలీమా మజారీని అదుపులోకి తీసుకున్న తాలిబన్లు, హక్కుల కోసం పోరాడుతున్న ఆప్ఘాన్ మహిళలు

వీరిని విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం బ్యాక్‌ చానెల్‌ ద్వారా చర్చలు ప్రారంభించినట్లు తెలిసింది. ఇక భారతీయ వైమానికి దళానికి చెందిన సీ-130జే విమానం కాబూల్ నుంచి దాదాపు 85 మంది భారతీయులను తరలించిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. వీరంతా ఇండియా వెళ్లడం కోసం ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

కాగా 150 మందిని కిడ్నాప్ చేసిన‌ట్లు వ‌స్తున్న వార్తల‌ను తాలిబ‌న్ ప్ర‌తినిధి అహ్మ‌దుల్లా వ‌సీక్‌ (Taliban Deny Kidnapping People) ఖండించారు. ఆఫ్ఘ‌న్ మీడియాతో ఆయ‌న ఈ విష‌యాన్ని తెలిపారు. అయితే దీని గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.