China Covid Update: చైనాలో మళ్లీ కరోనా కల్లోలం, రెండు ప్రధాన నగరాలు పూర్తిగా మూసివేత, తాజాగా 127 కరోనావైరస్ కేసులు, 183 మందిలో అసింప్టోమాటిక్ లక్షణాలు
రెండు నగరాలపై ఆ దేశం తీసుకున్న కఠిన చర్యలను తీసుకునేందుకు రెడీ అయింది. తాజాగా బీజింగ్ కు దక్షిణాన ఉన్న రెండు సిటీలను చైనా పూర్తిగా సీజ్ చేసింది. ఆ నగరాలకు రవాణా వ్యవస్థను కూడా ఆపేసింది. బయటి వారు అక్కడకు వెళ్లడానికి, అక్కడున్న వారు బయటకు రావడానికి వీల్లేకుండా చేసింది.
Beijing, Jan 9: 2019లో చైనాలో వుహాన్ లో పుట్టి ప్రపంచానికి పాకిన కరోనావైరస్ ఇప్పటికీ అందర్నీ వణికిస్తున్న సంగతి విదితమే. అయితే చైనా మాత్రం కరోనా నుంచి బయటపడిందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు ఎంత మాత్రం నిజమనేది బయటి ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే కేసుల వివరాలను (China Covid Update) ఆ దేశ ప్రభుత్వం చాలా గోప్యంగా ఉంచుతోంది. అయితే అది చాలాకాలం దాగదన్నట్లుగా మళ్లీ అక్కడ కరోనా పంజా విసురుతోంది.
మరోసారి కరోనా చైనాలో కల్లోలం రేపుతుండటంతో రెండు నగరాలను పూర్తిగా మూసివేసింది. రెండు నగరాలపై ఆ దేశం తీసుకున్న కఠిన చర్యలను తీసుకునేందుకు రెడీ అయింది. తాజాగా బీజింగ్ కు దక్షిణాన ఉన్న రెండు సిటీలను చైనా పూర్తిగా సీజ్ చేసింది. ఆ నగరాలకు రవాణా వ్యవస్థను కూడా ఆపేసింది. బయటి వారు అక్కడకు వెళ్లడానికి, అక్కడున్న వారు బయటకు రావడానికి వీల్లేకుండా చేసింది.
అక్కడి అధికారులు చెపుతున్న దాని ప్రకారం హుబేయ్ ప్రావిన్స్ లోని (Hebei province) షిజియాజువాంగ్ నగరంలో తాజాగా 127 కరోనా కేసులు (new COVID-19 cases) బయటపడ్డాయి. వీటికి తోడు అసింప్టొమేటిక్ లక్షణాలు (asymptomatic infections) ఉన్న మరో 183 మందిని గుర్తించారు. ఈ సిటీకి పక్కనే ఉన్న జింగ్టాయ్ నగరంలో కూడా తొమ్మిది కేసులు బయటపడ్డాయి. ఈ కేసులు అక్కడి అధికారులు అఫీషియల్ గా ప్రకటించినవి మాత్రమే. అనధికారికంగా ఎన్ని కేసులు ఉన్నాయో ఎవరికీ తెలియదు.
ఈ నేపథ్యంలో, ఈ రెండు సిటీలను చైనా సీజ్ చేసింది. తద్వారా వైరస్ చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది. ఈ రెండు నగరాల్లో దాదాపు 1.80 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ రెండు నగరాలు ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప సిటీని విడిచి వెళ్లడానికి వీల్లేదని అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా హెబీ ప్రావిన్స్ వైద్యాధికారి లీక్యీ మాట్లాడుతూ, విదేశాల నుంచే వైరస్ వచ్చిందని, విదేశాల నుంచి వచ్చిన వారివల్లే తాజా కేసులు నమోదయ్యాయని చెప్పారు. కరెక్ట్ గా ఎక్కడి నుంచి వైరస్ వచ్చిందనే విషయంపై ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని అన్నారు.
ఈ రెండు నగరాలకు కనెక్ట్ అయిన అన్ని రహదారులను మూసివేశారు. ప్రజలను వైద్య సిబ్బంది బలవంతంగా తీసుకెళ్లి టెస్టులు చేయిస్తున్న సీసీటీవీ ఫుటేజీని అక్కడి అధికారిక మీడియా ప్రసారం చేసింది. మరోవైపు ఈ సిటీల్లోకి ప్రవేశించే ప్రధాన రహదారుల ప్రవేశ ద్వారాల వద్ద వైద్య సిబ్బందిని మోహరింపజేశారు.
హుబేయ్ ప్రావిన్స్‌లోని అనేక మిలియన్ల మంది నివసించే నగరమైన షిజియాజువాంగ్‌లో ఈ కేసులు ఎక్కువగా బయటకు వచ్చాయి. అలాగే తొమ్మిది కేసులు పొరుగున ఉన్న జింగ్‌టాయ్‌లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో 7 మిలియన్ల మంది నివసిస్తున్నారు. దీంతో అలర్ట్ అయిన చైనా ప్రభుత్వం ఈ రెండు నగరాలను పూర్తిగా క్లోజ్ చేసింది. హుబేయ్ నివాసితులు కూడా బీజింగ్‌లోకి ప్రవేశించకుండా లేదా ప్రావిన్స్‌ను విడిచిపెట్టకుండా నిషేధించారు.
ఇదిలా ఉంటే వైరస్ నియంత్రణలు కఠినతరం కావడంతో చంద్ర నూతన సంవత్సరానికి వందల మిలియన్ల ప్రజల ప్రయాణ ప్రణాళికలు నాశనమవుతాయనే భయాలు ఉన్నాయి.ఫిబ్రవరి 11 నుండి 17 వరకు అక్కడ ద్ర నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో వాటిపై ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది.
ఇప్పటికే అక్కడ "సామూహిక వేడుకలు, సమావేశాలు మరియు ఉత్సవాలు నిషేధించబడ్డాయి" అని బీజింగ్ యొక్క వ్యవసాయ మరియు గ్రామీణ వ్యవహారాల అథారిటీకి చెందిన కాంగ్ సేన్ అన్నారు, అంత్యక్రియలు కూడా "గోప్యంగా" ఉండాలి మరియు అన్ని బహిరంగ కార్యక్రమాలకు ముందస్తు అనుమతి అవసరమని తెలిపారు. ఇదిలా ఉంటే వైరస్ నియంత్రణలో స్పష్టంగా నిర్లక్ష్యం చేసినందుకు షిజియాజువాంగ్ యొక్క ఘోచోంగ్ జిల్లాకు చెందిన ముగ్గురు అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.