UK Horror: పెన్సన్ డబ్బులు ఎంజాయ్ చేయడం కోసం స్నేహితుడి శవాన్ని 2 సంవత్సరాలు ఫ్రీజర్‌‌లో ఉంచిన ఓ వ్యక్తి, నిందితుడికి అనుకూలంగా షాకింగ్ తీర్పు ఇచ్చిన కోర్టు

ఓ వ్యక్తి పెన్షన్‌ (Pension) డబ్బు కోసం ఆశపడి 71 ఏళ్ల వృద్ధుడి (Pensioner) మృతదేహాన్ని రెండేళ్ల పాటు ఫ్రీజర్‌ (Freezer)లో దాచాడు. బర్మింగ్‌హామ్‌ (Birmingham)లో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Credits: Google

London, May 4: యూకేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పెన్షన్‌ (Pension) డబ్బు కోసం ఆశపడి 71 ఏళ్ల వృద్ధుడి (Pensioner) మృతదేహాన్ని రెండేళ్ల పాటు ఫ్రీజర్‌ (Freezer)లో దాచాడు. బర్మింగ్‌హామ్‌ (Birmingham)లో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

యూకే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్మింగ్‌హామ్‌ డౌన్‌టౌన్‌ క్లీవ్‌ల్యాండ్‌ టవర్‌ సమీపంలో డామియన్ జాన్సన్ (52), జాన్ వైన్‌రైట్ (71) ఓ ప్లాట్‌లో నివసిస్తుంటారు.వారిలో ఒకరైన వైన్‌రైట్‌ 2018 సెప్టెంబరులో మరణించాడు. అయితే డామియన్‌ జాన్సన్‌ ఈ విషయాన్ని బయటకి చెప్పకుండా జాన్సన్‌ మృతదేహాన్ని ఇంట్లోనే దాచాడు.

ఈ రాత్రికి నీతోనే అంటూ అందమైన అమ్మాయిల ఫోటోలతో 71 ఏళ్ల వృద్ధుడికి ఎర, 4.5 లక్షలు కాజేసిన కేటుగాళ్లు, లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

దాదాపు రెండేళ్ల పాటు ఆ బాడీని ఫ్రీజర్‌లో ఉంచాడు. ఈ లోపు వైన్‌రైట్‌కు వచ్చిన పెన్షన్‌ డబ్బును వ్యక్తిగత సరదాలకు వినియోగించుకున్నాడు. అంతేకాకుండా వైన్‌రైట్‌ కార్డులను కూడా ఉపయోగించేవాడని స్థానిక పోలీసులు తెలిపారు. 2020లో పోలీసులు వైన్‌రైట్‌ మృతదేహాన్ని కనుగొని జాన్సన్‌పై కేసు నమోదు చేశారు. నిందితుడి ఖాతా వివరాలపై పోలీసులు ఆరా తీయగా ఈ షాకింగ్ నిజాలు బట్టబయలయ్యాయి.

గతంలో వైన్‌రైట్‌తో కలిసి జాన్సన్‌ ఒక జాయింట్‌ ఖాతా తెరిచాడు. వృద్ధుడికి వచ్చే పెన్షన్‌ డబ్బు అదే ఖాతాలో పడుతుండేది. వీటిని వినియోగించుకునేందుకు మృతుణ్ని ఫ్రీజర్‌లో ఉంచినట్లు పోలీసుల ఎదుట జాన్సన్‌ అంగీకరించాడు. దీంతో అతనిని స్థానిక కోర్టులో హాజరుపర్చగా... ఖాతాను వినియోగించుకునేందుకు జాన్సన్‌ అర్హుడని భావించిన కోర్టు.. అతనికి బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వృద్ధుడు ఎలా మరణించాడనేది బయటపడలేదు. తదుపరి విచారణ కోసం న్యాయమూర్తి కేసును నవంబరు 7కు వాయిదా వేశారు. ప్రస్తుతం డామియన్ జాన్సన్ బెయిల్‌పై స్వేచ్ఛగా ఉన్నాడు