No Masks in Wuhan: కరోనాతో ప్రపంచం అల్లాడుతుంటే వుహాన్‌ ఎంజాయ్ చేస్తోంది, మాస్క్ లేకుండా వుహాన్‌ వాటర్ పార్కులో వేలాది మంది జనం, మాయా బీచ్ పార్క్‌లో విద్యుత్ వెలుగుల మ్యూజిక్ పార్టీ

అక్కడ పుట్టిన వైరస్ ప్రపంచం మొత్తాన్ని గజగజ వణికిస్తూనే ఉంది. మరి అలాంటి వుహాన్ నగరంలో ప్రజలు ఎలా ఉండాలి. కరోనా అంటే భయపడుతున్నారా..అబ్బే అదేం లేదు.. ఇప్పుడు వుహాన్ నగరంలో వాటర్ పార్కులు కిటకిటలాడిపోతున్నాయి. మొన్నటివరకూ కరోనాతో ఖాళీగా వెలవెలబోయిన వాటర్ పార్కులన్నీ జనంతో నిండిపోయాయి. లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో వేలాది మంది పార్టీలు (Partygoers Crowd) చేసుకుంటున్నారు.

Thousands of Partygoers Crowd Wuhan Maya Beach Water Park (Photo Credits: Rappler Twitter)

Beijing. August 19: కరోనాకు పుట్టినిల్లు ఏది అంటే ఎవరైనా టక్కున చెప్పే సమాధానం చైనాలోని వుహాన్ నగరం (Wuhan Coronavirus). అక్కడ పుట్టిన వైరస్ ప్రపంచం మొత్తాన్ని గజగజ వణికిస్తూనే ఉంది. మరి అలాంటి వుహాన్ నగరంలో ప్రజలు ఎలా ఉండాలి. కరోనా అంటే భయపడుతున్నారా..అబ్బే అదేం లేదు.. ఇప్పుడు వుహాన్ నగరంలో వాటర్ పార్కులు కిటకిటలాడిపోతున్నాయి. మొన్నటివరకూ కరోనాతో ఖాళీగా వెలవెలబోయిన వాటర్ పార్కులన్నీ జనంతో నిండిపోయాయి. లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో వేలాది మంది పార్టీలు (Partygoers Crowd) చేసుకుంటున్నారు.

వారాంతంలో నిర్వహించే వాటర్ పార్కుల్లోని పార్టీలకు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.. వుహాన్ వాటర్ పార్కుల్లో జన సమూహాలకు సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.. వుహాన్ సిటీలో మాస్కులు లేకుండా ( No Masks, No Social Distancing) వేలాదిమంది పార్టీల్లో కనిపించడం చూసి అందరూ అవాక్కయి పోతున్నారు. చైనాలో 60 ఏళ్ల తరువాత మళ్లీ సంక్షోభం, తరుముకొస్తున్న కరువు ఛాయలు, క్లీన్ యువర్‌ ప్లేట్‌ ఉద్యమం మొదలుపెట్టిన చైనా అధినేత జీ జిన్‌పింగ్‌

వుహాన్‌లోని మాయా బీచ్ పార్క్‌లో (Wuhan Maya Beach Water Park) ఆదివారం విద్యుత్ వెలుగుల మ్యూజిక్ పార్టీ జ‌రిగింది. ఈ పార్టీలో అనేక‌మంది నీళ్ల‌లో ఆట‌లాడుతూ, భౌతిక దూరాన్ని బుగ్గి చేస్తూ, ఫేస్ మాస్క్ ఊసే లేకుండా జ‌ల‌కాలాడారు. ఒక‌రినొక‌రు ఆనుకుంటూ గుంపులు గుంపులుగా ఎంజాయ్ చేశారు. కోవిడ్-19ను లైట్ తీసుకుంటూ మ‌ళ్లీ సాధార‌ణ జీవ‌నంలోకి తొంగి చూస్తున్నారు. విచిత్రమేమిటంటే వేలాదిమంది పాల్గొన్న ఈ పార్టీలో ఒక్క‌రు కూడా మాస్క్ ధ‌రించ‌‌క‌పోవ‌డం గ‌మనార్హం.

People Partying at Wuhan Maya Beach Water Park: 

కాగా ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్ర‌హావేశాల‌ను ఎదుర్కొంటున్నాయి. 'క‌రోనాను ప‌రిచ‌యం చేసి, ప్ర‌పంచాన్ని నాశ‌నం చేస్తూ మీరు మాత్రం ప్ర‌శాంతంగా గ‌డుపుతున్నారు' అని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. ఇదిలా వుండ‌గా గ‌తేడాది వూహాన్‌లో తొలిసారిగా క‌రోనా వైర‌స్ కేసు వెలుగు చూసిన విష‌యం తెలిసిందే. ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం, పెంపుడు కుక్కలను ప్రభుత్వానికి అప్పగించాలని ఆర్డర్ జారీ చేసిన కిమ్ జాంగ్, కుదేలైన వ్యవసాయ, పాడిపరిశ్రమ రంగాలు

ఆ త‌ర్వాతి నెల‌ల్లో కేసులు పెరిగిపోవ‌డంతో అక్క‌డ లాక్‌డౌన్ విధించారు. ఈ క్ర‌మంలో వాట‌ర్ పార్క్‌పై కూడా నిషేధం విధించారు. అయితే లాక్‌డౌన్ ఎత్తివేసే క్ర‌మంలో జూన్‌లో మ‌ళ్లీ ఈ పార్క్ తెరుచుకుంది. అయితే ప్ర‌జ‌లను మ‌ళ్లీ ఆకర్షితుల‌ను చేసేందుకు పార్క్ నిర్వాహ‌కులు కొత్త ప‌థ‌కం వేశారు. మ‌హిళా క‌స్ట‌మర్లు సాధార‌ణ‌ రుసుములో సగం చెల్లిస్తే స‌రిపోతుంద‌ని ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. ఇంకేముందీ.. జ‌నాలు.. ఈ అవ‌కాశం చేజారితే మ‌ళ్లీ దొర‌క‌ద‌న్న‌ట్టు పార్క్‌కు పెద్ద ఎత్తున క్యూ కట్టి క‌రోనా నిబంధ‌న‌ల‌కు మంగ‌ళం పాడారు. భారత్‌లో తొలి కరోనావైరస్ కేసు నమోదైంది ఇక్కడే 

కరోనాను చైనానే ప్రపంచానికి అంటించిందని బలంగా నమ్ముతున్న చాలా మంది.. వుహాన్ వాసులు ఇలా మాస్కులు లేకుండా ఎంజాయ్ చేస్తుండటం చూసి మరోసారి తమ వాదనను బలంగా వినిపిస్తున్నారు. చైనా సర్కారు మాత్రం తెలివిగా పర్యాటకులను ఆకట్టుకోవడం కోసం హుబే ప్రావిన్స్‌లోని 400 టూరిస్ట్ స్పాట్‌లలోకి ఉచితంగా పర్యాటకులను అనుమతిస్తున్నామని చెబుతోంది.

హుబే ప్రావిన్సులో మే నెలనుంచి కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదు.. లాక్ డౌన్ ఆంక్షలు సడలించినట్లు అధికారులు తెలిపారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి.. వ్యాపారాలు నెమ్మదిగా తెరుచుకున్నాయి.ప్రజా రవాణా కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడంతో సాధారణ జీవితంలో వుహాన్ ప్రజలు చేరుకున్నట్లు అనిపించింది. ఒక నెల తరువాత, జూలైలో, చైనాలోని చాలా ప్రాంతాల్లో సాధారణ స్థితికి చేరుకుంటోంది.. చాలా చోట్ల సినిమాలు తెరిచేందుకు అనుమతించారు. కొన్ని పార్కులు, గ్రంథాలయాలు, మ్యూజియంలు కూడా తెరిచేందుకు అనుమతించారు. కరోనా వైరస్ మొదటి కేసు చైనాలోని వుహాన్‌ విశ్వవిద్యాలయంలో, అక్కడే దాదాపు 500 మంది భారతీయ విద్యార్థులు

బహిరంగ సమావేశాలు నిర్వహించడానికి కూడా అనుమతి ఇచ్చారు. వుహాన్ హ్యాపీ వ్యాలీ మాయ వాటర్ థీమ్ పార్క్ జూన్ 25న ప్రారంభమైంది. ఈ ఆగస్టులో ఎక్కువ మంది సందర్శకులు వచ్చారు. ఈ పార్క్ ప్రస్తుతం వారాంతంలో 15,000 మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తోంది.. గత ఏడాదిలో ఈసారి చూసిన వారిలో సగం మంది ఉన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif