YouTube Premium Price Hike: భారత్ లో యూట్యూబ్ ప్రీమియం ధరలు పెంపు.. ఏకంగా 58% పెంపు!
ప్రముఖ ఓటీటీ యూట్యూబ్ వినియోగ దారుల సంఖ్య కూడా కోట్లలో ఉంటుంది. అయితే, ఇప్పటివరకూ యూట్యూబ్ యాక్సెస్ ఫ్రీగా లభిస్తున్నప్పటికీ, యాడ్స్ లేని కంటెంట్ కావాలన్నా, ప్రీమియం సేవలు లభించాలన్నా యూట్యూబ్ ప్రీమియం మెంబర్ షిప్ తీసుకోవాల్సిందే.
Newdelhi, Aug 27: ఇంటర్నెట్ విప్లవంతో (Internet) భారత్ లో సోషల్ మీడియా (Social Media) వినియోగం పెరిగింది. ప్రముఖ ఓటీటీ యూట్యూబ్ వినియోగ దారుల సంఖ్య కూడా కోట్లలో ఉంటుంది. అయితే, ఇప్పటివరకూ యూట్యూబ్ యాక్సెస్ ఫ్రీగా లభిస్తున్నప్పటికీ, యాడ్స్ లేని కంటెంట్ కావాలన్నా, ప్రీమియం సేవలు లభించాలన్నా యూట్యూబ్ ప్రీమియం మెంబర్ షిప్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఆ ప్రీమియం యూజర్లకు షాక్ తగిలింది. ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం ధరలు పెరిగిపోయాయి. ఏకంగా 58% వరకు ప్రీమియం ధరలు పెంచింది యూట్యూబ్.
ఏ ధర ఎంత?
ప్రీమియం సభ్యత్వం (సింగిల్) ధరను రూ. 149కి పెంచింది. యూట్యూబ్ ప్రీమియం కుటుంబ సభ్యత్వం ధర మొన్నటివరకూ నెలకు రూ. 189 వరకు ఉండగా తాజాగా రూ. 299 కు పెరిగింది. అంటే ఇది 58.2% పెరుగుదల అన్న మాట.