Sushant Singh Rajput Death Case: సుషాంత్ సింఘ్ రాజ్‌పుట్ కేసు సీబీఐకి, కేసు విచారణకు సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం

సుషాంత్ సింఘ్ రాజ్‌పుట్ కేసులు సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు (Sushant Singh Rajput Death Case) విచారణను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. సేకరించిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులకు సుప్రీంకోర్టు సూచించింది. దీంతో పాటు సీబీఐ విచారణకు సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.

Sushant Singh Rajput (Photo Credits: Facebook)

సుషాంత్ సింఘ్ రాజ్‌పుట్ కేసులు సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు (Sushant Singh Rajput Death Case) విచారణను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. సేకరించిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులకు సుప్రీంకోర్టు సూచించింది. దీంతో పాటు సీబీఐ విచారణకు సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అలాగే సుశాంత్‌ (Sushant Singh Rajput) సన్నిహితురాలు రియా పాత్రపైనా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో... రియాపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డం న్యాయ‌బ‌ద్ద‌మైన‌ని సుప్రీంకోర్టు (Supreme Court) అభిప్రాయపడింది. ఈ కేసులో సింగిల్ బెంచ్ జ‌స్టిస్ హృషికేశ్ రాయ్ ఇచ్చిన తీర్పును సుశాంత్‌ కుటుంబసభ్యులు స్వాగతించారు.

సుప్రీం ఆదేశాలతో సుశాంత్‌ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సీబీఐ దర్యాప్తు (Supreme Court Orders CBI Investigation) చేయనుంది. జూన్‌ 14న సుశాంత్‌ తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసు మొదటి నుంచి అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. బాలీవుడ్‌లోనే కాకుండా రాజకీయంగానూ సుశాంత్ మరణం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం తెలపగా.. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది.

ఈ కేసును మహారాష్ట్ర పోలీసులే పూర్తి దర్యాప్తు చేస్తారని, సీబీఐ విచారణ అవసరమే లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీ, బిహార్ పెద్దలు ఈ డిమాండ్‌ను తెరపైకి తెచ్చి తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని శివసేన ఆరోపిస్తూ వస్తోంది. ముంబై పోలీసులు అత్యంత సమర్థత కలిగిన వారని, నిజం వెలికి తీయడానికి వారు శక్తి వంచన లేకుండా కృషి చేస్తూనే ఉన్నారని సంజయ్ రౌత్ కూడా వ్యాఖ్యానించారు.  సుశాంత్ మరణంపై సీబీఐ విచారణ, బీహార్ ఎంపి పప్పు యాదవ్ లేఖపై స్పందించిన హోంమంత్రి, సుశాంత్ సింగ్ గర్ల్‌ఫ్రెండ్‌కి తప్పని వేధింపులు

కొన్ని రోజుల నుంచి ఈ కేసుకు తుది రూపం ఇవ్వాలని ముంబై పోలీసులు ప్రయత్నిస్తుంటే, మరోవైపు తీవ్ర గందరగోళాలు సృష్టించాలని బిహార్, ఢిల్లీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అయితే.. ఈ విషయంపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన బహిరంగంగానే డిమాండ్ చేశారు. దీంతో మహా వికాస్ అఘాఢీలో ఒక్కసారిగా గందరగోళం బయల్దేరింది. దీంతో ఏకంగా ఎన్సీపీ అధినేత శరద్ పవారే రంగంలోకి దిగి... వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.  కారణమదేనా? బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య, 'ఎంఎస్ ధోనీ' బయోపిక్‌తో పాపులర్ అయిన నటుడు, షాక్‌లో బాలీవుడ్

సుశాంత్ సింగ్ మృతిపై సీబీఐ విచారణ అవసరంలేదని, పార్థ్ చేసిన వ్యాఖ్యలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరంలేదని శరద్ పవార్ అన్నారు. అంతేకాదు, పార్థ్‌ను పరిపక్వతలేకుండా మాట్లాడారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర పోలీసుల పని తీరుపై తమకు పూర్తి విశ్వసనీయత ఉందని పవార్ తేల్చి చెప్పారు. అయినా సరే.. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ.. సుప్రీం ఆదేశాలివ్వడంతో మహారాష్ట్ర సర్కార్ ఇరుకునపడినట్లైంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ని మర్డర్ చేశారు, అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు, సిబీఐ విచారణ జరిపించాలని కోరిన జ‌న్ అధికార్ పార్టీ చీఫ్ ప‌ప్పూ యాద‌వ్

సుశాంత్‌ మృతి కేసుపై సీబీఐ విచారణకు బిహార్‌ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కేంద్రం ఇదివరకే అంగీకరించింది. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు బిహార్ సీఎం సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. అయితే, ఈ కేసులో తనపై పట్నాలో దాఖలైన కేసు విచారణను ముంబయికి బదిలీ చేయాలని కోరుతూ సుశాంత్‌ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆగస్టు 11 నాటి విచారణ సందర్భంగా.. రియా తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ... నిజం కంటే రాజకీయ జోక్యం ఎక్కువగా మారిందని స్పష్టమవుతోందన్నారు. అసంబద్ధమైన వాదనలతో బీహార్‌లో ఎన్నికల సందర్భంగా రాజకీయంగా ఈ కేసును వాడుకుంటున్నారని రియా చక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు.

సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడలేదని, హత్యకు గురయ్యారంటూ పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఆరోపిస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న నెల రోజుల తర్వాత ఆయన తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు చేశారు. రియా చక్రవర్తి, ఆమె కుటుంబం తన కుమారుడ్ని మోసం చేసిందని, ఆర్ధికంగా, మానసికంగా వేధించారని ఆయన ఆరోపించారు. కేసుకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి ఒక్కక్కరూ బయటకు వస్తున్నారని, వారికి భద్రత కల్పించాలని సుశాంత్‌ సింగ్‌ బంధువు, బీజేపీ ఎమ్మెల్యే నీరజ్‌ కుమార్‌ సింగ్‌ బబ్లు వ్యాఖ్యానించారు. ఈ కేసులో నిజాలు బయటపెట్టేందుకు చాలామంది సాక్ష్యులు ఉన్నారని, వారు ప్రాణ భయంతో బయటకు రావడం లేదన్నారు. కాబట్టి ఇప్పటికే ముందుకు వచ్చిన సాక్ష్యులకు భద్రత కల్పించాలన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now