Justice for Sushant: నిజాలు బయటకు రావాల్సిందే, సుశాంత్ ఆత్మహత్య కేసులో న్యాయం చేయాలని సోద‌రి శ్వేతా కీర్తిసింగ్ డిమాండ్, సుశాంత్‌ మృతిపై పోలీసులను ఆశ్రయించిన తండ్రి కెకె సింగ్
Sushant Singh Rajput (Photo Credits: Facebook)

బాలీవుడ్‌ యువనటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో రోజు రోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుశాంత్‌ మృతిపై ఆయన తండ్రి కేకే సింగ్‌ (KK Singh) పోలీసులను ఆశ్రయించిన సంగతి విదితమే.. ఇప్పుడు తాజాగా సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించిన కేసులో న్యాయం చేయాల‌ని కోరుతూ సుశాంత్ సోద‌రి శ్వేతా కీర్తిసింగ్ (Sushant Singh Rajput's sister Shweta Kirti Singh) డిమాండ్ చేశారు. సుశాంత్ మరణంపై సీబీఐ విచారణ, బీహార్ ఎంపి పప్పు యాదవ్ లేఖపై స్పందించిన హోంమంత్రి, సుశాంత్ సింగ్ గర్ల్‌ఫ్రెండ్‌కి తప్పని వేధింపులు

ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడూ నిజాలు బ‌య‌ట‌ప‌డ‌వు. జ‌స్టిస్ ఫ‌ర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Justice for Sushant Singh Rajput) అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇన్ని రోజులుగా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి విమర్శలు చేయని సుశాంత్‌ కుటుంబం (Sushant Family) ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.  కారణమదేనా? బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య, 'ఎంఎస్ ధోనీ' బయోపిక్‌తో పాపులర్ అయిన నటుడు, షాక్‌లో బాలీవుడ్

సుశాంత్ ఆత్మ‌హ‌త్య బాలీవుడ్‌లో పెను ప్రకంపనలను రేపుతోంది. న‌టి కంగ‌నా ర‌నౌత్ బీటౌన్‌లో పెద్ద చ‌ర్చ‌ను లేవ‌నెత్తారు. క‌ర‌ణ్ జోహార్, ఆదిత్య చోప్రా సుశాంత్‌ను బెదిరించార‌ని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో యష్ రాజ్ ఫిల్మ్స్ ఛైర్మన్ ఆదిత్య చోప్రా వాంగ్మూలాన్ని ముంబై పోలీసులు నమోదు చేశారు. ఈ నిర్మాణ సంస్థ సుశాంత్‌తో మూడు సినిమాల‌కు సంబంధించి ఒప్పందం చేసుకున్నా రెండు మాత్ర‌మే నిర్మించిన‌ట్లు తెలుస్తోంది.

Here's Sushant Singh Rajput's sister Shweta Kirti Singh Tweet

 

View this post on Instagram

 

If truth doesn’t matter, nothing ever will! #justiceforsushantsinghrajput

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on

ఇక క‌ర‌ణ్ జోహార్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ధర్మ ప్రొడక్షన్ పై కూడా కేసు న‌మోదైన నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం సీఈఓ అపూర్వ మెహతా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఒక‌వేళ అవ‌స‌ర‌మైతే క‌ర‌ణ్ జోహార్ కూడా విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంటుంద‌ని మ‌హారాష్ర్ట హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ సైతం ఇటీవ‌ల వ్యాఖ్య‌లు చేశారు.

ఇక బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ ను కూడా విచార‌ణ‌కు పిల‌వ‌గా ప్ర‌స్తుత క‌రోనా నేప‌థ్యంలో తాను ముంబై రాలేన‌ని, తన స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి అధికారుల బృందాన్ని మనాలికి పంపాలని, లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజ‌రవుతాన‌ని పేర్కొంది. కాగా సుశాంత్ ఆత్మ‌హ‌త్య కేసుసు సంబంధించి ముంబై పోలీసులు ఇప్పటివరకు 42 మంది స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు.

మరోవైపు రియా చక్రవర్తి (Rhea Chakraborty)కూడా సుశాంత్‌ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ఆమె సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి కూడా చేశారు. అంతేకాకుండా సుశాంత్‌తో తన జ్ఙాపకాలను పలుమార్లు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.